న్యాల్‌కల్: గ్రామాల్లో ఆదివారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఉదయం నుంచి యువకులు తమ ఎడ్లకు స్నానాలు చేయించి అందంగా అలంకరించారు.అలంకరించిన ఎడ్లకు లేగదూడలకు, ఆవులకు నైవేద్యాలు సమర్పిచి భోజనంగా బక్షాలను తినిపించారు.ఈ సందర్భంగా మండల పరిదిలోని హద్నూర్ గ్రామంలో ఎడ్ల బండ్ల ఊరేగింపు అందరిని ఆకటుకొంది.హనుమాన్ మందిరం నుంచి గ్రామ శివారులోని ఎల్లమ్మ మందిరమువరకు ఎడ్లు ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు.
బాజ భజంత్రీలతో ఆటపాటలు ముఖ్యంగా యువకుల నృత్యలు చూపరులను అకటుకొనేవిధంగా కొనసాగాయి.ఈ కార్యక్రమంలో మున్నూరు భీంశీ, ఈరన్న పాటిల్, అంజిరెడ్డి, పెద్దగొల్ల శుబాష్, పాపయ్య, సంగయ్యపాటిల్, వీరారుడ్డి,బస్‌రెడ్డి, శంబునినర్సారెడ్డి, గ్రామ యువజన సంఘాల నాయకులు పెద్దగొల్ల శేఖర్,ముంగిరాజు,నరేష్ శివారెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.