Monday, December 23, 2024

దేవాలయ స్థలం కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఆందోళన

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : రాజీవ్‌గాంధీనగర్ కాలనీలో గల హనుమాన్ దేవాలయ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోని స్థలాన్ని కాపాడాలంటూ శుక్రవారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు విశ్వహిందూ పరిషత్,బజరంగ్‌దళ్,బిజెవైఎం నాయకులతో కలిసి కాలనీ వాసులు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సికింద్రాబాదు విభాగ్ బజరంగ్‌దళ్ కన్వీనర్ శ్రీకాంత్,బిజెవైఎం రాష్ట్ర నాయకులు ఉడుత సంతోష్‌గుప్తా మాట్లాడుతూ రాజీవ్‌గాంధీనగర్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయానికి దాదాపు 750 గజాల స్థలం ఉందన్నారు.కాగా ఈ స్థలాన్ని కొంతమంది కాలనీ వాసులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఆ స్థలం తమదే అంటూ ప్రభుత్వానికి జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.

ఈ విషయమై కాప్రా మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన సరైన స్పందనలేదన్నారు.కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలికితే రాబోయే రోజులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.హిందువుల మనోభావాలను దెబ్బతిసేవిధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాగా రాజీవ్‌గాంధీనగర్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను గతంలో తహసీల్దార్ దేహుజా సీజ్ చేయగా కోర్టు ఆదేశాలను దిక్కరించి కొంతమంది వ్యక్తులు తిరిగి ఆక్రమించుకున్నారని బాధితులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాదీనం చేసుకోని కాలనీ వాసులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News