Friday, November 15, 2024

అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేదు

- Advertisement -
- Advertisement -

మణుగూరు : అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడే ప్రసక్తేలేదని మణుగూరు జెడ్పీటీసి పోశం నరసింహారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడీఒ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్‌లు, ఎంపిటీసిలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడుతూ… రాష్ట్రంలో సీయం కేసిఆర్ , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నియోజకవర్గాల అభివృద్ది, సంక్షేమంలో రాజీలేకుండ అభివృద్దిలో ముందుకు సాగుతున్నారని అన్నారు.

దానిలో బాగంగానే మణుగూరు మండల పంచాయితీలకు నిధులు మంజురి చేశామన్నారు. సమితి సింగారానికి రూ.2 కోట్లు, సాంబాయిగూడెంకు రూ.25లక్షలు, మిగిలిన పంచాయితీలకు రు10లక్షలలను మంజురు చేశామన్నారు. ఎమ్మేల్యే రేగా కృషితో మారుమూల గిరిజన గ్రామాలు, తండాలు నేడు పంచాయితీలుగా మారి, స్వంత భవనాలలో పాలన సాగిస్తు అభివృద్ది పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. మారుమూల గ్రామాలను సైతం ప్రధాన రహదారి అనుసందానం చేయాలనే లక్షంతో మారుమూల కాలనీలలో కూడ సీసీ రోడ్లు, డైనేజిల నిర్మాణం చేపట్టి యుద్ధప్రాతిపాదికన పనులు నడుస్తున్నాయని తెలిపారు.

రానున్న వర్షాకాలం నేపద్యంలో సర్పంచ్‌లు పారిశుద్ధంపై ప్రత్యేక శద్ద వహించి, స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పంచాయితీలకు నిధులు కేటాయించిన సీఎం కేసిఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం విజయ కుమారి, ఎంపిటిసిలు గుడిపూడి కోటేశ్వరావు, గాజుల రమ్య, బాబురావు, మండల సర్పంచ్‌లు తదితరులు పాల్గోన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News