Monday, January 20, 2025

మహావికాస్ అఘాడీలో గందరగోళం లేదు : శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

బారామతి (మహారాష్ట్ర): విపక్షం మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) లో ఎలాంటి గందరగోళం లేదని, ఐక్యంగానే ఉందని, ఈనెల 31న, సెప్టెంబర్ 1న ముంబైలో విపక్షకూటమి “ఇండియా” సమావేశం విజయవంతంగా నిర్వహించడమౌతుందని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తన దగ్గరి బంధువు అజిత్ పవార్‌తో శరద్‌పవార్ సమావేశం కావడంపై రాజకీయంగా అనేక ఊహాగానాలు రావడంతో శరద్ పవార్ తమ వైఖరిని స్పష్టం చేశారు.

ఎంవిఎ భాగస్వాములైన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఆ సమావేశాలపై తలెత్తిన గందరగోళాన్ని తొలగిస్తూ స్పష్టం చేయాలని శరద్‌పవార్‌ను కోరడంపై పవార్ స్పష్టత నిచ్చారు. ఎంవిఎ నుంచి చీలిన వారితో ఎన్‌సిపి ఎలాంటి పొత్తు ఉండదని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్ బీజేపీతో చేతులు కలుపుతున్నట్టు వచ్చిన వదంతులపై అలాంటి చర్చ అజిత్ పవార్‌తో జరిగిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదన్నారు.

పార్లమెంట్‌లో మణిపూర్ హింసపై చర్చ గురించి అడగ్గా ప్రధాని మోడీ రెండు గంటల పాటు మాట్లాడినా మణిపూర్ ప్రజలకు సరైన భరోసా ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. దేశంలో టమాటా ధరలు పెరిగిన తరుణంలో రైతులు కొంత ఆర్జిస్తుండగా, నేపాల్ నుంచి ప్రభుత్వం టమాటాలను దిగుమతి చేయడాన్ని శరద్ పవార్ ఆక్షేపించారు. థానే జిల్లా లోని ఆస్పత్రిలో గత 24 గంటల్లో 18 మంది చనిపోవడంపై ఆందోళన వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News