Friday, December 20, 2024

రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ ఎమ్మెల్యే జాజాల సురెందర్ హెచ్చరించారు. గురువారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో రైతులతో కలసి భారీ నిరసన ర్యాలీ టిపిసిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి రైతులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ చేపట్టారు. రైతు సంక్షేమ వ్యతిరేకి రేవంత్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టబొమ్మ దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ సాధించుకున్న తరువాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం వైపు దృష్టి సారించారన్నారు. రైతు రాజు అయితే రాష్ట్రమంతా బాగుంటుందనే ఉద్దేశంతో మొదటగా 12 గంటలు తరువాత 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందజేశారన్నారు.

రాష్ట్రంలో మల్లీ బిఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఫ్రస్టేషన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి అమేరికా తానా సమావేశంలో తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని మూడు గంటలు ఇస్తే చాలన్నారు. రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పార్టీ పట్టణ అద్యక్షుడు జలందర్ రెడ్డి, ఆదిమూలం సతీష్ కుమార్, ఎంపిపి కర్రె మాదవి బాలరాజ్ గౌడ్, జెడ్పిటిసీ ఉషాగౌడ్, ఎల్లారెడ్డి, గాందారి ఏఎంసీ చైర్మన్లు కాశీ నారాయణ, సత్యం రావు, ఎల్లారెడ్డి విండో చైర్మన్ ఎగుల నిర్సంలు, ఎంపిటిసీలు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News