Thursday, January 23, 2025

రాష్ట్రంలో సంక్షేమం అందని కుటుంబం లేదు : సబిత

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సబితా ఇంద్రారెడ్డి హాజరై జ్యోతి ప్రజల్వన చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం అందని కుటుంబం లేదని, మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలు అమలు చే స్తున్న గొప్ప మానవతా వాది ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. తొమ్మిదేళ్లలో ఆసరా పథకానికి దాదాపు రూ. 58600 కోట్లు చేశారని, దళితబంధు కోసం 1700 కో ట్లు కేటాయించారని తెలిపారు.

షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకం కింద రా ష్ట్రంలో 12లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో 1000 డబుల్ బెడు రూమ్‌లు ఇళ్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామని తెలిపారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను 31మందికి పంపిణీ చేసి నూతన జంటలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్‌గుప్తా, ఎగ్గే మల్లేశం, గ్రంథాలయ సంస్థ్ద చైర్మన్ ఆయాచితం శ్రీధర్ , జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనిత, ఆర్డీవో సూరజ్‌కూమార్, జోనల్ కమిషనర్ పంకజ, సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, తహల్దార్ జయశ్రీ, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరివింద్‌శర్మ, యూత్ మాజీ అధ్యక్షులు కొండల్‌రెడ్డి, గడ్డిన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ రాంనర్సింహ్మగౌడ్, సాజిద్, శేఖర్, వెంకటేష్‌గౌడ్, శ్రీనివాస్, పటేల్ సునీతారెడ్డి, మారం సుజాతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News