Monday, December 23, 2024

బిజెపిలో కుటుంబపాలనకు తావు లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీజేపీలో కుటుంబ పాలన ఉండదని రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గురువారం బర్కత్ పురలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తాందన్నారు. 9 ఏళ్ల్లలో ఒక్క కేంద్ర మంత్రిపైనా అవినీతి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు.

బీజేపీ నేతలకు దేశ సంక్షేమం తప్ప వ్యక్తిగత ఎజెండా ఉండదని నేడు ప్రపంచాన్ని భారత్ లీడ్ చేస్తోందని ఆయన చెప్పారు. భారతదేశం మారిందని, ఇది పాత ఇండియా కాదన్నారు. డిజిటల్ రెవల్యూషన్ కారణంగా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండటంతో దళారుల చేతికి వెళ్ళకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేరుతున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఇప్పటి వరకు దాదాపు రూ. 30 లక్షల కోట్లు పేదలకు అందినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో రూ.100 లబ్దిదారులకు పంపిస్తే రూ.15 మాత్రమే అందేవని రాజీవ్ గాంధీ చెప్పారని, కానీ నేడు ఆ దుస్థితి లేదన్నారు. గతంలో రేషన్ షాపుల్లో తప్పుడు డేటా, పేర్లతో బియ్యం దోచుకునేవారని, దొంగిలించేవారని ఆయన ఆరోపించారు. కానీ ఇప్పుడు దానికి ఆస్కారం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు రేషన్ ను డిజిటలైజేషన్ చేశాక విమర్శలు చేశారని, వారి నోర్లు ఇప్పుడు మూత పడ్డాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News