Monday, December 23, 2024

ఎక్కడా ఉద్యోగికి ఆర్థిక భద్రత లేదు : సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మేలు కలిగే నిర్ణయాన్ని తీసుకోవాలని రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పింఛన్ రద్దు వల్ల పారిశ్రామికవేత్తలకు ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ పెట్టుబడిగా మారిందని, ఎక్కడ కూడా ఉద్యోగికి ఆర్థిక భద్రత లేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ గ్రాంట్ కలిపి రూ.16 వేల కోట్లు ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 1,72,000 సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ నిలుపుదల చేసి, సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్‌ను అమలు చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ నేతృత్వంలో ఆదివారం యూనియన్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్డులో 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు, రాష్ట్ర శాఖ సభ్యుల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ తక్షణమే సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ప్రతి సిపిఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడిని కలిసి పాత పెన్షన్ ఆవశ్యకతను తెలియజేస్తూ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ ,ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్ లు 33 జిల్లాల అధ్యక్ష ,కార్యదర్శులతో కలిసి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్, కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సంకల్ప యాత్ర ఈ నెల 16వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు 33 జిల్లాల మీదుగా ‘అభీ నహీతో కభీ నహీ’ అనే నినాదంతో సాగుతుందని సిపిఎస్ ఉద్యోగ , ఉపాధ్యాయుల పాతపెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News