Sunday, January 5, 2025

ఇంటి అద్దెపై జిఎస్‌టి ఉండదు

- Advertisement -
- Advertisement -

స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : అద్దె ఇంటిపై 18 శాతం జిఎస్‌టి చెల్లించాంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అద్దెకు నివసిస్తున్నట్లయితే అద్దెతో పాటు 18 శాతం జిఎస్‌టి కూడా చెల్లించాలనే వార్తలను వినే ఉంటారు. ఈ వార్త వైరల్ కావడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తను ఫేక్ అని పేర్కొంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇంటి అద్దెపై 18 శాతం జిఎస్‌టి అనే వార్త పూర్తిగా తప్పు అని తెలిపింది. గత నెలలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ప్రకారం, ఒక వ్యక్తి తన వ్యాపార ప్రయోజనం కోసం నివాస ప్రాపర్టీని అద్దెకు తీసుకుంటే, ఆ వ్యక్తి జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News