Monday, December 23, 2024

పోచారం లాంటి వారు పార్టీ మారితే నష్టమేమీ లేదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారినంత మాత్రన బిఆర్ఎస్‌ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, అలాంటి వాటిని పట్టించుకోవద్దని ఆ పార్టీ అధినేత కెసిఆర్ అన్నారు. మంగళవారం ఆయన ఫామ్ హౌస్‌లో పార్టీ ఎంఎల్ఏ లు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎల్ఏ లు, ఎంఎల్ సి లు, నేతలతో తరుచూ సమావేశమవుతానన్నారు.

ఈ భేటీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కెపి. వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఇతర సీనియర్ నేతలు భేటీ అయ్యారు. వారితో కలిసి కెసిఆర్ లంచ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News