పెనుబల్లి : తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పెనుబల్లిలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో సంక్షేమ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిసి కుల వృత్తుల సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం కొరకు ప్రవేశపెట్టిన బీసీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్ళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను, చెక్కులతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెళ్లికూతురులకు సొంత ఖర్చులతో చీరను బహూకరించారు. ప్రభుత్వ స్థలాల్లో కొన్నాళ్ల క్రితం ఇండ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి విద్యాచందన, ఎంపిపి లక్కినేని అలేఖ్య, జట్పిటిసి చెక్కిలాల మోహనరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, మందడపు అశోక్‌కుమార్, లక్కినేని వినీల్, కోటగిరి సుధాకర్‌బాబు, తహశీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ మహాలక్ష్మిలతో పాటు కల్లూరు, వేంసూరు, తల్లాడ, సత్తుపల్లి, పెనుబల్లి ఎంపిపి, జట్పిటిసి, ఎంపిడిఓ, తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
సిఎం కెసిఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -