Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సంక్షేమ సంబురాలులో శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా తమకు జరిగిన మే లును వివరిస్తూ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటామని చెప్పారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి అనేక సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 63 మంది సీఎంఆర్‌ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.25,18,500 విలువ గల చెక్కులు, 94 మంది కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ.94,10,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో గడిచిన తొమ్మిదేళ్ళలో బీఆర్‌ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా 4596 మందికి రూ.28.16 కోట్లు, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ ద్వారా 10777 మందికి రూ.102.54 కోట్లు, ఆసరా పింఛన్లు 30572 మందికి నెలకు రూ.6.62 కోట్లు, సంవత్సరానికి రూ.79.54 కోట్లు, దళిత బంధు ద్వారా 100 మందికి రూ.10 కోట్లు, జిహెచ్‌ఎంసి పరిధిలో డ్వాక్రా 7799 గ్రూపులకు 452 కోట్ల 95 లక్షలు, దుండిగల్ లో 688 గ్రూపులకు 42 కోట్ల రుణాలు, 363 మందికి రూ.5.1 కోట్ల ఖర్చుతో గొర్రెల పంపిణీ.. ఇలా మొత్తం రూ.261 కోట్ల రూపాయల విలువ చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు కులవృత్తుల వారు 11 మందికి లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభించి.. రూ.11 లక్షలు ఆర్థిక ప్రేరణ కింద అందజేయ డం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ గారి సుపరిపాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, రైతు భరోసా, దళితులకు దళిత బంధు ఇలా అనేక పథకాలు అందజేస్తోందన్నారు. 2014కు ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసిన ఏకైక నాయకుడు గౌరవ సీఎం కేసీఆర్ అని అన్నారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బ లోపేతం చేయడం కోసం కులవృత్తుల కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారని అన్నారు. వెనుకబడిన సామాజికవర్గాల్లోని చేతివృత్తులు, కులవృత్తులు నిర్వహించే మేదరి, కమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన 200 రూపాయల పింఛన్‌ను ఆసరా కింద రూ.2,016 , దివ్యాంగులకు రూ.3,016 పెంచడం ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కేసీఆర్‌తోకే సాధ్యమైందని అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినా ప్రజల సంక్షేమానికి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ గారు ఉద్యమ నాటి నుండి ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా అ నేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద, మధ్య తరగతి ప్రజల జీ వితాల్లో వెలుగులు నింపారని అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు యావత్ దేశానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో డిసీలు, ఎమ్మార్వోలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News