Friday, December 27, 2024

సంక్షేమంలో బీఆర్‌ఎస్‌కు సాటి లేదు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: నిరుపేద ప్రజలు రైతు సంక్షేమ అమలులో బీఆర్‌ఎస్ పార్టీకి సాటి ఏ పార్టీ లేదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌కె గార్డెన్‌లో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది గులాబీ గూటిలో చేరారు. బీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు పూదరి చంద్రశేఖర్, నాయకులు పెర్క కనకయ్య, రంగంపల్లి మాజీ వార్డు సభ్యులు, రాష్ట్ర సంచార ముస్లీం సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మత్, మామిడిశెట్టి తిరుపతి, 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థులతోపాటు మహమ్మద్, మామిడిపల్లి కనకయ్య, పెరక రవి, యాకూబ్, తాజ్, పెందుర్తి వెంకన్న, బొమ్మగాని అరవింద్‌తోపాటు అధిక సంఖ్యలో చేరారు.

అలాగే ఇదే వేదికగా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ యూత్ నాయకులు పొన్నాల మనోజ్, పొన్నాల యశ్వంత్, పొన్నాల అజయ్, పొన్నాల సజన్, పొన్నాల సాగర్, పొన్నాల అనిల్ తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వారు గజమాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలనే యువత పార్టీలో చేరారన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా చిన్న తరహ పరిశ్రమలు నడిచే విధంగా నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌కు దక్కుతుందన్నారు. గత 9 ఏళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ఏ పార్టీ చేయలేదన్నారు.

రైతులకు రైతుబందు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. నూతనంగా ఇండ్లు నిర్మించుకునే వారికి గృహలక్ష్మీ పథకం కింద రూ.3 క్షలు అందజేస్తుందన్నారు. వృత్తి నైపుణ్యత పెంచడానికి బీసీ బంద్ పథకం కింద రూ.50 మందికి రూ.లక్ష ఆర్థిక రుణ సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముసలి కన్నీరు కార్చుతూ మోసం చేసే పార్టీల మాటలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న ప్రాంతాలలో దమ్ముంటే అర్హులైన వారికి రూ.4 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కార్యకర్తలు చర్చ పెట్టి వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందుగా రంగంపల్లి నుంచి పెద్దపల్లి వరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జడల సురేందర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, కొలిపాక శ్రీనివాస్, గాదె మాదవి, సాబీర్ ఖాన్, పెంచాల శ్రీధర్, పైడ రవి కుమార్, కొమిరిశెట్టి శ్రీకాంత్, ఖదీర్‌ఖాన్, గొట్ట మహేష్, దేవనంది దేవరాజ్, నాయకులు గండు రంగయ్య, వైద శ్రీనివాస్, బంక అశోక్, కందుకూరి అనిల్, కుక్క కనకరాజు, వెన్నం రవీందర్, పల్లె మధు, కాశిపాక వాసు, అస్గర్, ఉప్పు రమేష్, రవూఫ్, జాకీర్, గొట్టెముక్కుల శ్రీనివాస్, కుంభం సంతోష్, దేవనంది నవీన్, బొంకూరి అనిల్, సముద్రాల రాజ్ కుమార్, అడప సంతోష్, కుక్క మనోజ్‌లతోపాటు సుల్తానాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు గొట్ట మహేష్, రఫీక్, ఏకశిల శ్రీనివాస్, వహీద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News