Monday, December 23, 2024

దేశంలోనే మేటి.. తెలంగాణకు రాదు సాటి

- Advertisement -
- Advertisement -

మక్తల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే మక్తల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రమంతా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదని, దీంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మేటి అని, ప్రస్తుతం మరే రాష్ట్రం కూడా తెలంగాణకు సాటి రాదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. దేశంలో ఏర్పడిన రాష్ట్రాల్లో తెలంగాణ చివరిదైనప్పటికీ, అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తున్నదన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ కోసం అశువులు బాసిన అమరవీరులను తెలంగాణ ప్రజల చివరి శ్వాస వరకు స్మరించుకుంటామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్షంగా ఏర్పడిన తెలంగాణలో ప్రస్తుతం నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు.

నియామకాల్లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా ముందున్నామన్నారు. అంతకుముందు అమరవీరుల ప్రాణత్యాగాలకు గుర్తుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు కావలి శ్రీహరి, రుద్రసముద్రం రామలింగం, కావలి తాయప్ప, గోవర్ధన్‌రెడ్డి, గవినోళ్ల నర్సింహారెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్, శివారెడ్డి, మధు, జుట్ల సాగర్, కౌన్సిలర్లు శ్వేత విష్ణువర్ధన్‌రెడ్డి, మొగులప్ప, నర్సిములు, రాములు, కో ఆప్షన్ సభ్యులు శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News