Monday, December 23, 2024

గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండదు

- Advertisement -
- Advertisement -

తమ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు
ఈసారి మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా దాటుతుంది
కర్ణాటక పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక పిసిసి అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె. శివకుమార్ తాజాగా బెంగళూరులో స్పందించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని డికె ఆరోపించారు.

గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలిస్తామన్న వార్తలన్నీ వందంతులే అని ఆయన కొట్టిపారేశారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులని అందులో తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అయితే ఈసారి మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా దాటుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News