Sunday, December 22, 2024

అభివృద్ధ్ధిలో నన్ను ఆపేది ఎవరూ లేరు : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం : భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధ్దిలో ప్రథమ స్థానంలో ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతి పక్షపార్టీలన్ని ఏకమై విమర్శలు చేస్తున్నాయని ప్రతి పక్షపార్టీలు చేస్తున్న విమర్శలను బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వెల్లడించారు. అదివారం బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో బిఎన్‌రెడ్డి నగర్ ఆటో స్టాండ్ చౌరస్తాలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బి.ఆర్.ఎస్‌లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్‌లో గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడం జరిగిందని నేను చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని కాంగ్రెస్, బిజెపి పార్టీలతోపాటు మా పార్టీకి చెందిన కొంతమంది దొంగలు వ్యక్తి గతంగా నాపై విమర్శలు చేస్తూన్నారని ఇలాంటి విమర్శలను నేను బయపడేది లేదని అభివృద్ధే నాధేయ్యం నన్ను ఆపేది ఏవ్వరు లేరు అని సుధీర్‌రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి, హైదరాబాద్‌లోని 24నియోజక వర్గాల కంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో 9 సిమ్మింగ్‌పూల్స్‌ను మంజూరు చేయిండం జరిగిందిని అందులో రెండు పూర్తి చేసి ప్ర జలకు అదించానని సుధీర్‌రెడ్డి వెల్లడించారు.

ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను నగర శివారులోని కోహెడకు మార్చడం జరిగిందని గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు స్థలంలో 100 పడకల హాస్పిటల్ పనులు జరుగుతున్నాయని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కుం ట్లూరి వెంకటేష్‌గౌడ్, అనిల్ చౌదరి, గంగం శివశంకర్, రాఘవేందర్ రావు, శ్రీనివా స్, జక్కిడి రఘువీర్ రెడ్డి, సతీస్ చౌదరి, మహిళ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, మహెష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News