Wednesday, January 22, 2025

విద్యుత్ డిమాండ్ భవిష్యత్తులో 17వేల మెగావాట్లకు చేరుకున్నా ఇబ్బంది లేదు

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో, జెన్‌ఎకో సీఎండి ప్రభాకర్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్‌ః భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు అన్నారు.మంగళవారం విద్యుత్ సౌధలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్బంగా సీఎండి మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, తెలంగాణ పవర్ యుటిలిటీలు (30.03 2023న) అత్యధిక గరిష్ట డిమాండ్ 15,497 మెగావాట్లను (ఉమ్మడి ఏపీలో పీక్ డిమాండ్ 13,162 మెగావాట్లను) చేరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ట్రాన్స్‌మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి రూ.40,017 కోట్లు పెట్టుబడి పెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతుల నిరాశను పోగొట్టేందుకు చరిత్రలో తొలిసారిగా 27.7 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 01.01.2018 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కెపాసిటీ 02.06.2014 నాటికి 7,778 మెగావాట్ల నుంచి నాటికి 18,756 మెవాట్లకు పెరిగిందన్నారు. 24×7 ప్రాతిపదికన నాణ్యమైన మరియు విశ్వసనీయమైన విద్యుత్ లభ్యత, సమర్థవంతమైన, పారదర్శక విధానాలతో, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు అగ్రగామిగా నిలిచిందని, విద్యుత్ రంగం అభివృద్ధికి ఉద్యోగులందరూ పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర మిగులు విద్యుత్‌ను సాధించే ప్రయత్నంలో టిఎస్ జెన్‌కో చేపట్టిందని నాలుగు వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణాన్ని రూ, 34,400 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి సూచికగా ఉన్న తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1196గా ఉంది, ప్రస్తుతం 2140 యూనిట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే 70% ఎక్కువ. 1255 యూనిట్లుగా పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ట్రాన్స్‌మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి 40,017 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల నిరాశను పోగొట్టేందుకు చరిత్రలో తొలిసారిగా 27.7 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 01.01.2018 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
టిఎస్‌పిడిసిఎల్‌లో …
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ సీఎండి జి. రఘుమారెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల అలుపెరుగని పోరాటాల మరియు ప్రాణత్యాగాల ఫలితంగా మనమంతా స్వేచ్చాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం గురించి మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం 5661 మెగావాట్లు వున్న గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతానికి 15497 మెగావాట్లకు చేరిందన్నారు.

సంస్థ పరిధిలో రాష్ట్రము ఏర్పడే నాటికి 68 లక్షలు వున్న వినియోగదారులు ప్రస్తుతం 1.10 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. 2014 లో 4710 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ 9360 మెగావాట్లకు చేరిందన్నారు.పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా పంపిణి వ్యవస్థను మెరుగు పరచడం కోసం గడచిన 9 సంవత్సల్లో రూ, 14,263 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు.సంస్థ పరిధిలో 579 ౩౩/11 కేవీ సబ్ స్టేషన్స్, 1370 పిటిఆర్‌ఎస్ 2.74 లక్షల డిటిఆర్‌ఎస్ 5,822 కిలోమీటర్ల 33 కేవీ లైన్స్, 43,052 కిలోమీటర్ల 11 కేవీ లైన్స్, 52 వేల కిలోమీటర్ల ఎల్‌టి లైన్స్ నూతనంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత నెలలో రాష్ట్రంలో లో కురిసిన భారీ వర్షాలకు ప్రజా జీవితానికి తీవ్ర ఆటంకం కలిగిందన్నారు.భారీ వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాదికన పునరుద్ధరణ గావించడంలో విద్యుత్ అధికారులు సిబ్బంది తీవ్రంగా శ్రమించగ, సంస్థ ఉద్యోగులు కొంత మంది తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వరదల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ అంశంపై సిఎం కె. చంద్రశేఖరరావు సైతం విద్యుత్ శాఖ పనితీరుపట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయ తెలిపారు. అన్ని రంగాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించటంతో పాటు, నూతన సర్వీసుల మంజూరు, బిల్లింగ్ లోపాలు సరి చేయడం వంటి ఇతర సేవలను సైతం నిర్దేశిత కాలంలో పరిష్కరిస్తూ సంస్థ అభివృద్దికి కృషి చేయాలన్నారు.
సింగరేణి కార్మికులకు త్వరలో రూ. 700 కోట్లు బోనస్ : సీఎండి శ్రీధర్
సింగరేణి భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ సీఎండి ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ..దేశంలో ఉన్న సుమారు 200కు పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యద్భుత ప్రగతితో సింగరేణి సంస్థ పురోగమిస్తూ దేశ సేవకు అంకితమై పనిచేస్తోందని, ఇకపై కూడా ఇదే ఒరవడితో పనిచేస్తూ వచ్చే ఐదేళ్ల లో 12 కొత్త గనులు, 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో గత 9 సంవత్సరాల్లో దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని టర్నోవర్ ను, లాభాలను గడించిందన్నారు. తెలంగాణ రాక పూర్వం 2013–14 లో కేవలం 419 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే సాధించిన సింగరేణి గత ఏడాది 2,222 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందన్నారు. అలాగే తెలంగాణ రాక ముందు సంవత్సరం కార్మికులకు 83 కోట్ల రూపాయలను లాభాల బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది 700 కోట్ల రూపాయల లాభాల బోనస్‌ను త్వరలోనే కార్మికులకు చెల్లిస్తామన్నారు. సిఎం కెసిఆర్ ఇటీవల శాసనసభలో సింగరేణి సంస్థ ప్రగతిని ప్రశంసించడమే కాక కార్మికులకు లాభాల బోనస్, దీపావళి బోనస్ కలిపి వెయ్యి కోట్ల రూపాయలను చెల్లిస్తున్నట్లు ప్రకటించారని, ఆయన ఆదేశానుసారం దసరా పండుగకు ముందే 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను పంపిణీ చేస్తామన్నారు.

దేశ ఇంధన అవసరాలరీత్యా నేడు ప్రైవేట్ కంపెనీలు కూడా బొగ్గు ఉత్పత్తిలోకి వస్తున్నాయని, రానున్న రెండుమూడేళ్లలో ప్రైవేట్ ఉత్పత్తి దారులతో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలని, పూర్తి పనిగంటలు వినియోగిస్తూ ఉత్పాదకత పెంచుకోవడమే కాకుండా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.సింగరేణి మనుగడను దృష్టిలో ఉంచుకొని వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ నెలకొల్పిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పవర్ ప్లాంట్లలో నెంబర్- 1 స్థానంలో ఉందని,అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత 300 మెగావాట్ల సోలార్ పవర్‌కు అదనంగా మరో 240 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను మరో ఏడాది లోగా ఏర్పాటు చేసి మొత్తం 540 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామన్నారు. దీంతో సింగరేణి సంస్థ తన థర్మల్, సోలార్ ప్లాంట్ల నుండి 2,540 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందించబోతున్నట్లు తెలిపారు.రానున్న ఐదేళ్ల లో 12 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సమర్పించామని, వీటిలో నాలుగు ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించబోతున్నామన్నారు. 2029-30 నాటికి సింగరేణి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలు రాయిని దాటుతుందన్నారు.
జీవితాలను ఆర్దికంగా మార్చగల శక్తి విద్యుత్‌కు ఉంది: ఎన్‌పిడిసిఎల్ సీఎండి అన్ననేని
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ( ఎన్‌పిడిసిఎల్) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎండి అన్నమనేని గోపాల రావు మాట్లాడుతూ ..జీవితాలను ఆర్దికంగానే కాకుండా సామాజికంగా మార్చగల శక్తి విద్యుత్‌కు మాత్రమే ఉందని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్‌ఎన్‌పిడిసిఎల్) సిఎండి అన్నమనేనని గోపాలరావు అన్నారు.
సంస్థ ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాని ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు ఎన్నో విధాలుగా స్వాతంత్రం కోసం పోరాడి అమరులు అయ్యారు అని వారి పోరాటాల ఫలితమే మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. అన్నారు. విద్యుత్ రంగము తెలంగాణలో కారు చీకట్లే అన్న మాట నుంచి ఇప్పుడు వెలుగు రేఖగా మారిందనన్నారు.

సిఎం కేసిఆర్ సారధ్యములో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండి డి.ప్రభాకర్ రావు గార్ల మార్గదర్శకత్వంలో నేడు తెలంగాణలో నాణ్యమైన,మెరుగైన 24 గంటలుఅంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు.రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నేడు 15497 మెగావాట్లు (174%) ఉండగా రాష్ట్రం ఏర్పాటైన నాడు 5661 మెగావాట్లుగా ఉందన్నారు. సాగు 68% విస్తీర్ణంలో వృద్ధి సాధించిందని,ఉత్పత్తి టన్నుల్లో 260% వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ, 7086 కోట్లతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు చెప్పారు. 489 నూతన 33/11 కెవి సబ్ స్టేషన్ లు , 1,21,375 ట్రాన్స్ ఫార్మర్లు,1040 పిటిఆర్లు, 3,46,795 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు 3259 మెగావాట్లు విద్యుత్ సరఫరాను అందించగా మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 387 ప్రాంతాలో 223 కోట్లతో విద్యుత్ సరఫరాను అందించామన్నారు.1244 రైతు వేదికలకు రూ, 7.33 కోట్లు, రూ, 171 కోట్లతో పల్లె ప్రగతి, రూ, 61 కోట్లతో విద్యుత్ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. 2,96,662 ఎస్‌సి విని యోగదారులకు, 1,94,224 ఎస్‌టి వినియోగదారులకు 101 యూనిట్లు విద్యుత్ సరఫరా ఉచితముగా అందిస్తున్నామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందామన్నారు. విద్యుత్ సాంకేతిక నష్టాలను 11.71% నుండి 9.65%కి (22- 23కి) తగ్గించామన్నారు. ఐఆర్డి ఏ బిల్లింగ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందామని, ఇప్పాయి (ఐపీపీఏఐ), పవర్ అవార్డులు మన సంస్థ పొందడం ప్రశంసనీయమని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News