Monday, January 20, 2025

పార్టీ మారే సమస్యే లేదు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: కోదాడ నియోజకవర్గ మాజీ ఇం చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని రాజకీయంగా బదనాం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మధ్యమాలలో వస్తున్న వార్తలపై ఆయన కొట్టి పారేశారు. పార్టీ ఇంచార్జిగా నియోజకవర్గంలో అధిక మొత్తంలో సభ్యత్వాన్ని చేర్చి బలోపేతం చేశానని నిబద్దతగా పనిచేస్తున్న తనపై అసత్య ప్రచారం చేయటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు సామాజిక మాధ్యమాలు, వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలను, ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి నాయకత్వంలో తాము పనిచేస్తామన్నారు.

నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందని, మూడవసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు నా గేంద్రబాబు, రాయపూడి వెంకటనారాయణ, గుండపనేని నాగేశ్వరరావు, తిపిరిశెట్టి రాజు, రామినేని సత్యనారాయణ, సుంకరి నాగయ్య, హాసన్ అలీ, రామాచారి, నాగేశ్వరరావు, చలిగంటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News