Sunday, December 22, 2024

హైదరాబాద్ తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ లో తాగు నీటికి కట కట అంటూ వస్తున్న వార్తల పై హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.. ప్రస్తుతం కృష్ణ తాగు నీటి సరఫరా వ్యవస్థ పై ఎలాంటి భయందోళనలు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత స్థితి ప్రకారం నీటి మట్టం 520.8’ అడుగులు ,ఎండిడిఎల్ కంటే రిజర్వాయర్ సామర్థ్యం 510 అడుగులు ఉందన్నారు. ఈ స్థాయిలో 19.061 టిఎంసీలు నిలువ ఉందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం. రిజర్వాయర్ 826.6 అడుగులు ,నీటి నిలువ సామర్థ్యం 46.21 టీఎంసీలు ఉందన్నారు. 805 అడుగుల పైన ఉన్న రిజర్వాయర్ సామర్థ్యం 14.59 టిఎంసీలు ఉందన్నారు.. రెండు రిజర్వాయర్లలో 33.62 టీఎంసీల నీటిని వినియోగించుకోగల ప్రత్యక్ష లభ్యత ఉందని తెలిపారు.

ప్రస్తుతం కృష్ణా ఫేజ్-వన్‌లో , రెండవ మూడవ దశల ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 270 ఎంజిడి నీరు సరఫరా చేయబడుతోందన్నారు. భవిష్యత్తు కోసం నెలకు 1.40 నీటికి సమానంఅని తెలిపారు. రిజర్వాయర్‌లలోకి తాజా ఇన్‌ఫ్లోల వరకు 10.00 టీఎంసీల నీరు అవసరం అని తెలిపారు. అత్యవసర పంపింగ్ ఏర్పాట్ల కోసం 2017 సంవత్సరంలో చేసిన ఏర్పాట్ల మాదిరిగానే ప్రస్తుత నీటి పంపింగ్ ప్రక్రియ కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇందులో జిహెచ్‌ఎంసి ప్రాంతాలకు నిరంతరాయంగా నీటి సరఫరా అందించబడుతుందని, పస్తుతం కృష్ణా తాగునీటి సరఫరా వ్యవస్థపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News