Monday, December 23, 2024

ఫార్ములా రేస్‌తో ఫాయిదా లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఎవరికీ తలవంచేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నా రు. మంగళవారం సచివాలయం మీడియా పా యింట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో భట్టి మాట్లాడారు. ‘ఫార్ములా ఇ-రేస్ నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిందని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని గత ప్రభుత్వం లోని నేతలు ఆరోపిస్తున్నారని అయితే గత ప్రభుత్వం ఫార్ములా ఇ రేస్, ఏస్ నెక్స్ జెన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం కల్పించాలని ఆయనన్నారు. రేస్ ద్వారా టికెట్లు అమ్ముకొ ని లబ్ధి ఏస్ నెక్స్ జెన్ సంస్థ భావించిందని త్రైపాక్షిక ఒప్పందాన్ని ద్వైపాక్షిక ఒప్పందం గా మార్చేశారు. రేసుకు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించి అనుమతులు ఇప్పించాల్సి ఉందన్నారు. రూ.55 కోట్లు చెల్లించారని, ఇంకా రూ. 55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసు వ చ్చిందని భట్టి తెలిపారు.

ఇది బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా గత ప్రభుత్వం తప్పిదం చేసిందని ఆ యన తెలిపారు. రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టి. ట్రాక్ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందని. రేస్ సందర్భంగా వారం పది రోజులు రోడ్లు బ్లాక్ చేశారు. ఏజెన్సీ కంపెనీ మాత్రం టికె ట్లు అమ్ముకొని వెళ్లిపోయింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదని ఆయన వివరించారు. ప్రతీ పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సిఎం అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని. ఫార్ములా ఇ-రేస్‌పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వి మర్శించారు. ఈ విషయంలో వాస్తవాలు వెలికి తీ స్తున్నామని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు. ముందు ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కలలు కోరికలతో భవిష్యత్ లో మార్పు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అ త్యంత వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేరాలని తెలంగాణ తెచ్చుకున్నారన్నారని వారందరి శ్రేయ స్సు ఇప్పుడు మా ప్రభుత్వం ముందున్న కర్తవ్యమ ని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, భ విష్యత్ కోసమే ప్రతి పైసా ఖర్చు పెడతామన్నారు. కొద్దీ మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వాడుకున్నారని విమర్శించారు. ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామన్నారు.

ఐదు గ్యారంటీల హామీలకు సంబంధించిన దరఖాస్తులను ఇంటింటికి పంపిణీ చేశామని, దరఖాస్తులు నింపడానికి సహాయకులను నియమించామని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్ మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటికో ఉద్యోగం ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇస్తామని హామీలు ఇచ్చి పదేళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని గత పాలకులు నెలరోజులు నిండిన కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంటే జనాలు నవ్వుతున్నారని భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం లబ్ధి పొందారని ఆయన తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచడం వల్ల అనేక మందికి లబ్ధి జరుగుతోందన్నారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు ఇచ్చామని చెప్పారు. రెండు ఎకరాలున్న రైతులకు రైతు బంధు నిధులు వేస్తున్నామన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News