Monday, December 23, 2024

విద్యాసంస్థల్లో ‘నెలసరి’ సెలవుల ప్రతిపాదనలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సంబంధించి విద్యాసంస్థల్లో నెలసరి సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఏమీలేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ మంత్రి సుభాస్ సర్కార్ లోక్‌సభలో తెలిపారు. లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర విద్యామంత్రి బదులిస్తూ విద్యాశాఖలో అటువంటి ప్రతిపాదన లేదని సభలో వెల్లడించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మహిళలు, మహిళా సెల్‌కోసం సురక్షితమైన వాతావరణం, ప్రాథమిక సౌకర్యాల కోసం మార్గదర్శకాలును (విధానాల అమలు, పర్యవేక్షణ, పరిష్కారం) హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్(హెచ్‌ఇఐ)ల్లో ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కాగా 24గంటల నీటి సరఫరా, సబ్బు, డస్ట్‌బిన్‌లు, శానిటరీతో కూడి పరిశుభ్రమైన ప్రత్యేక విశ్రాంతి గదులు, ప్యాడ్ డిస్పోజల్ డబ్బాలు, తదితర సౌకర్యాలు ఉన్నత విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంచాలని యూజీసీ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News