Monday, December 23, 2024

వయస్సుకు రిటైర్మెంట్ లేదు

- Advertisement -
- Advertisement -

యువకుల్లా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: వయస్సుకు రిటైర్మెట్ లేదని వయస్సు పైబడిన యువకుల్లా ఉత్సాహంగా పాల్గొనడం సంతోషమని, నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మనం చిన్నప్పుడు ఎన్నో క్రీడలు ఆడామని, కానీ నేడు యువత చరవాణిలకు, వీడియో గేమ్స్‌కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదని అన్నారు. శనివారం ఇందిరాగాందీ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించే నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తొమ్మిదవ తెలంగాణ స్టేట్ చాంపియన్ షిప్-2023 అథ్లెటిక్ క్రీడా పోటీలను క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించి పోటీనలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 35 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఈ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనడం విశేషమన్నారు. 25 జిల్లాల నుంచి 23 క్రీడ అంశాలతో 715 మంది క్రీడాకారులు ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఫిబ్రవరి 15, 16న హర్యానాలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. వయస్సుతో సంబందం లేకుండా కృష్ణా రామ అనే వయసులో హై జంపు, లాంగ్ జంప్‌లో పోటీల్లో పాల్గొన్న వారిని చూసి దేశంలో ఉన్న యువత స్పూర్తి పొందాలని కోరారు. క్రీడల ద్వారా శారీరక దృడత్వం కలిగి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడి ఏడున్నర కోట్లతో సింథటిక్ ట్రాక్‌ను ఏర్పరచుకొని నేడు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో స్పోర్ట్ హాస్టల్ అవశ్యకత అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, అథ్లెటిక్స్ ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, స్పోర్ట్ ఆథారిటి చైర్మన్ అంజనేయగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మర్రి లక్ష్మణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News