Monday, December 23, 2024

మహిళల సంక్షేమంలో ఆగేదేలేదు

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: సిఎం కెసిఆర్ పాలనలో ఆడబిడ్డల సంక్షేమానికి ఇది సర్ణయుగమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ వంశీ కృష్ణ అద్వర్యంలో జరిగిన మహిళా సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీ ఎం కెసిఆర్ మహిళల పక్షపాతి, మహిళ సంక్షేమం గు రించి ఆలోచించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వారి ఆలోచనలు రాష్ట్రంలో పథకాలుగా మారి దేశానికి ఆదర్శం గా నిలిచాయి.

కాంగ్రెస్, బీజేపీ లకు చిల్లర రాజకీయాలు చేయడం తప్ప వేరే పని ఏమి లేదని, కాంగ్రెస్, బీజేపీ లు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి. సమైక్య పాలన లో ఏనాడు అ యినా మహిళల సంక్షేమం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో సంక్షేమం… ప్రతి ముఖంలో సం తోషం చూడాలన్నదే సీఎం కెసిఆర్ ల క్ష్యం. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి గుర్తులు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సీఎం కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళు. బడ్జెట్ లో సగం సంక్షేమానికి కేటాయిస్తున్నారన్నారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆకాశంలో సగం కాదు, ఆమె ఆకాశం అని మేయర్ అన్నారు.

సీఎం కేసీఆర్ సర్కార్ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదుల అవ్వల వరకు కంటికి రెప్పలా కాపాడుతోందన్నారు. అమ్మఒడి వాహనమైనా, ఆరోగ్యలక్ష్మి పథకమైనా, భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు ఒక అన్నలా, ఒంటరి మహిళలకు తండ్రిలా, ఆడబిడ్డలకు మేనమామలా, అవ్వలకు పెద్దకొడుకులా, కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ను యావత్ మహిళా లోకం మనసారా ఆశీర్వదిస్తుందన్నారు. ఈ కార్యక్రంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సబ్యులు, అధికారులు, పెద్దఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News