Sunday, January 19, 2025

మంచినీటికి భరోసా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు సీన్ భాగ్యనగరంలో రిపీట్ కాదు

అవన్నీ అవాస్తవాలే గ్రేటర్ మంచినీటి అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి
కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడంతో ఎండిపోయిన బోర్లు ఫలితంగా
అక్కడక్కడ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్ ఈ నెల 15నుంచి అత్యవసర పంపింగ్
సమీక్షా సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మంచినీటి కొరత ఉండబోదని, నీటి సరఫరాకు సరిపోను నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. బెంగుళూరు తరహాలో హైదరాబాద్ నగరంలో నీటి కష్టాలు రాబోతుందన్నది పూర్తి అవాస్తవమని, ఎవరూ అలాంటి భ యాందోళనలకు గురి కావదని ఆయన భరోసా ఇచ్చారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయ్యాయని దీంతో ట్యాంకర్ల డిమాండ్ పెరిగిదే తప్ప తాగునీటికి ఎ లాంటి ఇబ్బందలు లేవని, రావని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం జలమండలి కార్యాలయంలో తాగునీటి సరఫరాపై హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి జరుగుతున్న మంచినీటి సరఫరాకు సంబంధించి ఆయన సమీక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మీడియాతో మాట్లాడుతూ నగర తాగునీటి అవసరాలకు గాను హిమాయత్ సాగ ర్, ఉస్మాన్ సాగర్, సింగూరు, మంజీర, కృష్ణా ఫేస్ 1,2, 3, గోదావరి నుండి ప్రతి రోజూ 2602.29 ఎంఎల్‌డి నీ టిని సరఫరా అవుతోందని చెప్పారు . ఇందులో జిహెచ్‌ఎంసి కోర్ సిటీలో 1098 ఎం ఎల్ డి, జీహెచ్ ఎంసీ శివా రు ప్రాంతాల్లో 1084.44 ఎంఎల్‌డి, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మునిసిపాలిటీలకు 270.66, ఎంఎల్ డి మిషన్ భగీరథ కోసం 149.19 ఎంఎల్‌డి కేటాయించినట్లు ఆయన తెలిపారు.

నగర తాగునీటి అవసరాలకు ఏలాంటి కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వివిధ ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలను ఆయన మీడియాకు వివరించారు. నాగార్జున సాగర్‌లో సోమవారం నాటికి 133.71 టిఎంసి, నీరు అందుబాటులో ఉందని, ఇందులో డెడ్ స్టోరేజ్ 131.66 టిఎంసి కాగా, తాగునీటికి 2.05 టిఎంసి వాడుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లిలో నీరు 7.38 టిఎంసి అందుబాటులో ఉందని, దీని డెడ్ స్టోరేజ్ 3.31 టిఎంసిలు కాగా ఇందులో నుంచి 4.07 టిఎంసి వాడుకోవచ్చని, అయితే జలమండలి వేసవిలో అవసరమయ్యే నీరు 3.33 టిఎంసిలు మాత్రమేనని చెప్పారు. డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీటిని తొడ్కేనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 15 నుంచి అత్యవసర పంపింగ్ ప్రారంభం

నగర తాగునీటి అవసరాల కోసం ఈనెల 15 అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి నాగార్జున సాగర్, 16 నుంచి నుంచి ఈ నెల 15 నుంచి, మే 1 నుంచి ఎల్లంపల్లిలో నుంచి అత్యవసర పంపింగ్ ప్రారంభం అవుతాయని తెలిపారు. అదేవిధంగా నగరంలో ప్రస్తుతం 706 వాటర్ ట్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా ఆదివారం నాటికి 7772 ట్రిప్స్ ద్వారా నీటిని అందించడం జరిగిందని చెప్పారు.

భూగర్భ జలలు తగ్గడం వల్లే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 37 వేల ఇళ్లలో సర్వే నిర్వహిస్తే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడం ఆ కారణంగా 65 శాతం బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి లభ్యత తగ్గి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లు జలమండలి అధికారులు గుర్తించారని చెప్పారు. ఈ సమస్య అధికంగా నగరానికి వెస్ట్ ప్రాంతంలో ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరా కు డిమాండ్ పెరిగిందని, దీంతో నగరంలో ఇప్పటి వరకు 78 ఫిల్లింగ్ స్టేషన్ల ఉండగా, కొత్తగా మరో 22 ఫిల్లింగ్ స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు దాన కిశోర్ వెల్లడించారు. ఈ సమావేశంలో జలమండలి ఎం.డి సుదర్శన్ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News