Sunday, December 22, 2024

ప్రధాని మోడీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కొంచం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదని షా అన్నారు.

సర్జికల్ స్ట్రయికస్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రిజర్వేషన్లపై రేవంత్ ది తప్పుడు ప్రచారం అన్నారు. 10 ఏళ్ల మోడీ పాలనలో రిజర్వేషన్లను తీసేశామా? అని ప్రశ్నించారు. ఇండియా కూటిమి ఒక వైపు…దేశం కోసం ప్రాణమిచ్చే బిజెపి మరో వైపుందన్నారు. బిజెపి అధికారంలో ఉన్నంత కాలం పివోకెను పాకిస్థాన్ కు దక్కనివ్వం అన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News