Monday, December 23, 2024

డబుల్ ఇంజన్‌తో ఒరగబెట్టింది ఏమిలేదు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఒరగబెట్టిందేమి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి 25 సంవత్సరాలుగా బిజెపి ఏలుబడిలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ను పోల్చి చూద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేశారు.

గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మొత్తం బిజెపి పాలిత రాష్ట్రాల్లో కల్పించిన ఉద్యోగాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో సరైన ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి బిజేపి అధినాయకత్వం పడరాని పాట్లు పడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి అనుగుణంగా కేంద్రం నుంచి పూర్తిగ విఫలమైన కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బిజెపి దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కుట్రలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అవాస్తవాలను మాట్లాడినందుకే 2014/ 2018 ఎన్నికల్లో పట్టిన గతే బిజెపికి 2023 ఎన్నికల్లో పునరావృతం అవుతుందని అన్నారు. ఆయన వెంట జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపిపి నెమ్మాది భిక్షం నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News