Sunday, November 17, 2024

మంచి నాయకున్ని ఎన్నుకోవటానికి ఒకేఒక అస్త్రం ఓటు : ముఠాగోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: అర్హులైన వారు తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ముషీరాబాద్ ఎ మ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ ఉపాధ్యక్షులు మార్క రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాంనగర్ దయారా మార్కెట్ వద్ద నూతన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులంతా తప్పని సరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

దేశంలో ప్రజలంతా సమానమనే భావన కలిగేందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల, మత, ప్రాంత బేధాలతో సంబంధం లేకుండా 18 సంవత్సరా లు నిండిన వారందరికీ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పించారని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఎన్ను కోవడానికి పౌరులందరికీ ఓటు హక్కు ఆయుధం లాంటిదన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసు కోవాలని అన్నారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజస్, సీనియర్ నాయకులు ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, ప్రవీణ్ ముదిరా జ్, శ్రావణ్, శ్రీనివాస్, మున్నా నాయక్, జశ్వంత్, వాసుదేవ్, మొయిస్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కవాడిగూడ డివిజన్ మల్లయ్య హోటల్ వద్ద బిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News