Monday, December 23, 2024

చెప్పాల్సింది చాలా ఉంది

- Advertisement -
- Advertisement -

న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల సిఫార్సుల ఆమోదంలో
కేంద్ర జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల బదిలీలు, నియా మకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజి యం చేసిన సిఫార్సులను ఆమోదించి నోటిఫై చేయడంలో కేంద్రప్రభుత్వం చేస్తున్న జాప్యం పై దాఖలయిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ అంశంపై చెప్పాల్సింది చాలా ఉంది కానీ ప్ర భుత్వం మరికొంత సమయం కోరినందున ఎక్కువ మాట్లాడడం లేదని వ్యాఖ్యానించిం ది. 2022 నవంబర్‌నుంచి దాదాపు 70 పేర్లు హైకోర్టులు పంపించాయని, అయితే అవి తమకు చేరలేదని జస్ట్టిస్‌కౌల్ ఆందోళన వ్యక్తం చేశారు ‘ ఖాళీలు పెద్ద అంశం కాబట్టి నేను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. గత ఏడు నెలలుగా ఏ ఒక్క పేరు కూడా మాకు చేరలేదు. సిఫార్సులు చేయడం జరిగింది కానీ వారి నియామకం జరగలేదు’ అని కౌల్ అన్నారు. ఓ సున్నితమైన హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సహా అత్యంత ముఖ్యమైన నియామకాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ కౌల్ అన్నారు. తన వద్ద మొత్తం గణాంకాలున్నా యని స్పష్టం చేశారు. దీనిపై తాను చాలా చెప్పాలని అనుకున్నానని కానీ అటార్నీ జనరల్ వారం రోజులు సమ యం అడిగినం దున ఎక్కువ మాట్లాడడం లేదని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News