Monday, December 23, 2024

చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధ్ది పథంలో దూసుకుపోతున్న తరుణంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బి.కె.రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్‌కుమార్‌గౌడ్, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బుక్క రవి సహా స్థానిక యువకులు, మహిళలు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రిపై పూల జల్లు కురిపించి పాలాభిషేకం చేశారు.

పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద పార్టీ చేరికల కార్యక్రమం అనంతరం మంత్రి వారించినా వినకుండా స్థానికులు క్షీరాభిషేకం చేశారు. అభిమానులు కార్యకర్తలు జై శ్రీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆనందబాష్పాలు వచ్చాయి ….. మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ ..పార్టీ చేరికలు కార్యక్రమం అనంతరం స్థానికులు ఒక్కసారిగా వచ్చి హఠాత్తుగా పాలాభిషేకం చేశారని ఎంత వారించినా వినలేదని మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వారి అభిమానం చూసి ఆనందబాష్పాలు వచ్చాయన్నారు. గతంలో అనేక సమస్యలు ఉండేవని వాటన్నిటిని క్రమంగా పరిష్కరించుకుంటూ వ స్తున్నామని తెలిపారు. మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించారని పేర్కొన్నారు.

ప్రజల అభిమానంతో నాపై మరింత బాధ్యత పెరిగిందని , ఇప్పటికి చేసింది సరిపోదని ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయన్నారు. ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే చక్కని ఉద్యోగాలు లభించేలా అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకురావడమే తమ ధ్యేయమని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News