Wednesday, January 22, 2025

ఖమ్మంలో జరిగే భట్టి ముగింపు సభకు భారీగా తరలి వెళ్ళాలి

- Advertisement -
- Advertisement -

మధిర : ఖమ్మంలో జులై 2న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కోరారు. గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భట్టి విక్రమార్క కుమారుడు మల్లు విక్రమాదిత్య పాల్గొని యూత్ కాంగ్రెస్లో ఉత్సాహాన్ని నింపారు. మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్ ర్యాలీని అమ్మా ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీ అంబేద్కర్ సెంటర్, నందిగామ క్రాస్ రోడ్డు, రాయపట్నం సెంటర్, మెయిన్ రోడ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, వైయస్సార్ చౌరస్తా, ఆర్‌వి కాంప్లెక్స్ మీదుగా జిలుగుమాడు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మల్లు నందిని, సూర్య విక్రమాదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మల్లు భట్టి విక్రమార్కతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, రారా బాలరాజు కోన ధని కుమార్, పారుపల్లి విజయకుమార్, కర్నాటి రామారావు, అద్దంకి రవికుమార్, నిడమానూరి వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News