Friday, November 22, 2024

ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి

- Advertisement -
- Advertisement -
చిరుధాన్యాల వినియోగం పెంచాలి : డైరెక్టర్ తారా సత్యవతి

హైదరాబాద్: ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా.తారా సత్యవతి అన్నారు. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురష్కరించుకుని సోమవారం రాజేంద్రనగర్ జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఆడిటోరియంలో చిరుధాన్య పంటల సాగు, ఉత్పత్తి , ఉత్పాదకత తదితర అంశాలపై జాతీయ స్థాయి మేధోమథన సదస్సును ఐసిఏఆర్ ఏడి .డా.ఎక్ కే ప్రధాణ్ ప్రారంభించారు.

భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వార్షిక చిరుధాన్యాల సమూహ సమావేశాల మొదటి రోజు మేధోమధన సమావేశానికి కన్వీనర్‌గా వ్యహరించిన డా.తారా సత్యవతి మాట్లాడుతూ చిరుధాన్యాల పంటల సాగు ఉత్పత్తిని పెంచేందుకు ఎంతకృషి జరుగుతోందని తెలిపారు. చిరుధాన్యపు ఉత్పత్తులతో చేసిన ఆహారం ఎంతో బలవర్ధకం అన్నారు.ప్రజల ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాల ఆహరోత్పత్తులు కూడా ప్రధానం కవాల్సిన అవసరం ఉదని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.కె ప్రధాన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఓ.పి. యాదవ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామిరెడ్డి కో- చైర్మన్లుగా వ్యవహరించడం జరిగింది.

మేధో మధన కార్యక్రమంలో చిరుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడం, విలువ ఆధారిత ఉత్పత్తులు, స్పీడ్ బ్రీడింగ్, చిరు ధాన్యాలు, జొన్న, సజ్జ సాగులో కొంగ్రొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా మరియు రైతు పొలాల్లో దిగుబడులు వ్యత్యాసం- తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై సుమారుగా 32 మంది శాస్త్రవేత్తలు వివిధ దేశాల నుండి తమ అనుభవాలు , పరిజ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా 2022-23 సంవత్సరంలో జొన్న, సజ్జ మరియు ఇతరత్ర చిరుధాన్యాలలో జరిగిన పరిశోధనా ఫలితాలను, 2023-24 సంవత్సరానికి గాను చేపట్టబోయే కార్యక్రమాలను రూపొందించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News