Saturday, November 23, 2024

ఉచిత న్యాయ సేవ అందించడంలో వివక్షత ఉండకూడదు

- Advertisement -
- Advertisement -
  • న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి స్వాతి రెడ్డి

సిద్దిపేట: ఉచిత న్యాయ సేవ అందించడంలో వివక్షత ఉండకూడదని న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ,ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి స్వాతి రెడ్డి అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీస్ ఆదారిటి ఆద్వర్యంలో జిల్లా ప్యానల్ లీగల్ అడ్వకేట్, డిపెన్స్ అడ్వకేట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు అశించిన విధంగా పేదవారికి ఉచిత న్యాయ సహాయంను అందించాలని చట్టపరంగా అందర్ని చైతన్యం చేయాలన్నారు. టినేజ్ పిల్లలు మాదక ద్రవ్వాలకు అలవాటు పడి చెడు మార్గాల వైపు మరలే అవకాశం ఉంది. కాలేజీ స్ధాయిలో విద్యార్థి, విద్యార్థునులకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్యానల్ అడ్వకేట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కేసు పరిశీలన చేస్తున్నప్పుడు కుటుంబ సమస్యలు సున్నితంగా ఉంటాయి కాబట్టి కుటుంబ సమస్యలు జటిలం కాకుండా సునిశితంగా పరిశీలించి కుటుంబాలను పిల్లలను కలిపేందుకు ప్రాదాన్యతను ఇచ్చి కలిపే విధంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాదులు బాలయ్య, ఆత్మరాములు, లింగంగౌడ్, శ్రీకర్ రెడ్డి, రోహిణి రెడ్డి, రాజలక్ష్మి, సరిత, పరుశరాములు, రియాజోద్దిన్, కృష్ణమోహన్, లీగల్ సర్వీస్ ఆథారిటి సూపరింటెండెంట్ మదుసూదన్‌రెడ్డి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News