కాళేశ్వరం అడుగడుగునా అక్రమాలే
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్: గత ప్రభుత్వం కాళేశ్వ రం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన సుమారు లక్ష కో ట్లు వృథా అయ్యే ప్రమాదంలో ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ నివాస్‌రెడ్డి, ఐటి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మం త్రి దుద్దీళ్ల శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శా ఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కూడిన మం త్రుల బృందం నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా కాళేశ్వరం ప్రా జెక్ట్ సందర్శనకు వచ్చిన మంత్రుల బృందానికి జి ల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఘన పలికారు. అనంతరం మీడియా సమక్షంలో అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భం గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడగడుగునా అక్రమాలు కనిపిస్తున్నాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలపై ఊహించలేని భారం పడుతుందన్నారు. ప్రాణహితచేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రాజకీయ కోణం ఉందనే మా సందేహం క్లియర్ అయిందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 38వేల కోట్లతో 16.40లక్షల ఎకరాల ఆయకట్టు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ప్రణాళిక రూపొందిండం జరిగిందన్నారు. 11వేల కోట్లు సైతం ఖర్చు చేశామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్ట్ ప్రణాళికను మేడిగడ్డ వద్దకు మార్చిందని అన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ.95,000 కోట్లు ఖర్చు చేసి దాదాపు లక్ష ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పాడిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మహా అద్భుతం అన్నారన్నారని కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ కావడం దురదృష్టమని అన్నారు. అక్టోబర్ 21నాడు ప్రాజెక్ట్ పెద్ద శబ్ధంతో కుంగడం జరిగిందన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నోరు మెదపలేదని, ఎక్కడ రివ్యూ చేయలేదని, స్టేట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. సిడబ్ల్యూసి ప్రాజెక్ట్ నిర్మాణానికి 80 కోట్లకు ఆమోదిస్తే ఇప్పుడు లక్షన్నర కోట్ల ఖర్చు జరుగుతుందన్నారు. మేడిగడ్డ ఒకటే కాదని, అన్నారం, సుందీళ్ల బ్యారెజీలకు కూడా నష్టం జరిగిందని వాటిని కూడా పరిశీలించాలన్నారు. ప్రాజెక్ట్‌లో లోపం జరిగిందని దవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నీటి నిల్వ సామర్థం 2 టీఎంసీల కంటే ఎక్కువ ఉండదని, కానీ మేడిగడ్డ సామర్థం 16 టీఎంసీలకు పెంచారన్నారు. ఎక్కడైనా డ్యాంలు నీటి నిల్వ కోసం బ్యారేజీలు, రెగ్యూలర్ డైవర్ట్ వాటర్ ఫ్లో కోసం నిర్మిస్తారన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అలా జరగలేదన్నారు. జూలై 11,2019న పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాపై ప్రశ్న అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార వినతి రాలేదని కేంద్ర జలవనరుల శాఖ జవాబు చెప్పినట్లు తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగరెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణ చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి పునర్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.
ఒక ఎకరం నీరు అందించడానికి రూ.46 వేల ఖర్చు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 1 ఎకరం నీరు అందించడానికి 46 వేల ఖర్చు అవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ముందుగా గడిచిన -ఐదు సంవత్సరాలలో ఎన్ని టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశారని, ఎన్ని గోదావరిలో వదిలి పెట్టారని ప్రశ్నించారు. అసలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖరీఫ్, రబీ రెండు పంటలకు నీరు అందుతాయి అనేది వాస్తవానికి దూరంగా ఉందన్నారు. అయితే ఒక యూనిట్ విద్యుత్ వినియోగానికి ఖర్చు రూ.6 ఖర్చుఅవుతే, గత ప్రభుత్వం రూ.3 మాత్రమే ఖర్చు చేశామని చెప్పారన్నారు. ప్రాజెక్ట్ ద్వారా రూ.1 కి, రూ.1.50 పైసలు ఆదాయం వస్తుందని చెప్పారని ఇప్పుడు 52 పైసలు మాత్రమే వచ్చే ప్రయోజనం ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్‌లో 47శాతం ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తుంటే, ఈ ప్రాజెక్ట్ సంపూర్ణ వినియోగానికి అవసరమయ్యే విద్యుత్ 14,344 మెగవాట్లని అన్నారు. అయితే ఇది తెలంగాణ 90శాతం విద్యుత్ వినియోగంతో సమానం అని పేర్కొన్నారు. 2వ టీఎంసీ నీటి వినియోగం పూర్తిగా అమలు కాకముందే 3వ టీఎంసీ కోసం రూ.28,150 కోట్లు నామినేషన్ దాఖలు చేశారని విమర్శించారు. మరోవైపు భూకంపం ప్రభావంపై అధ్యయనం చేసిన తర్వాతనే 50 టీఎంసీల మల్లనసాగర్ రిజర్వాయర్ నిర్మించారా అనే సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కాగ్ సైతం తప్పుపట్టినట్లు గుర్తు చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు ఇతరుల పేర్ల మీద మేడిగడ్డ, అంబట్‌పల్లి, సూరారం రైతుల భూములను అన్యాయంగా కోనుగోలు చేశారన్నారు. దీనిపై కూడా విచారణ జరగాల్సి ఉందన్నారు.
50 టిఎంసిల నీటిని లిఫ్ట్ చేయడానికి లక్ష కోట్లు ఖర్చా? : మంత్రి పొంగులేటి
50 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి లక్ష కోట్లు ఖర్చు చేశారా అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ 28న మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని అప్పుడే మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదని అన్నారు. ఇది ఒకటి , రెండు ఫిల్లర్లతో ఆగదని రాప్ట్ కింద ఉన్న సాండ్ కాంపాక్ట్ చేసి ఉంటే డ్యాం ఈ పరిస్థితుల్లో ఉండేదని కాదని అన్నారు. 10 నుండి 12 శాతం వడ్డీకి అప్పు తెచ్చి కట్టారని అన్నారు. ఇది నాలుగు కోట్ల ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. టెండర్‌లలో చూపిన ఆసక్తి నాణ్యతలో గాని, మరమతులలో గాని ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన వీటినంటిపై సమాధానాలు చెప్పాలన్నారు. వరదలు వచ్చినప్పుడు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పని చేయలేదని అందుకు సంబంధించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ఉన్న నీటిని సక్రమంగా వాడలేనప్పుడు మూడో టీఎంసీ నీటి వినియోగానికి నామినేషన్ పనులు ఎందుకు మొదలు పెట్టారని ప్రశ్నించారు.
అవసరం లేకున్నా 3వ టీఎంసీ పనులు చేపట్టారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవసరం లేకున్నా 3వ టీఎంసీ పనులు చేపట్టారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణకు గ్రావీటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం మూలంగా రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటర్లను బిగించారని, వాటిపై విచారణ జరపలని కోరారు. అసెంబులడ్ మోటార్లకు ఒక్కో దానికి రూ.4వేల కోట్లు చెల్లించారని అన్నారు. నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లపై చిన్నచూపు చూశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎంత పారకం జరిగింది? : మంత్రి పొన్నం
కాళేశ్వరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వ మానస పుత్రిక అని, అసలు ఈ ప్రాజెక్ట్‌తో ఎంత నీటిని ఇప్పటి వరకు లిఫ్ట్ చేశారని, ఎంత పారకం జరిగిందని రా్రష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అలాగే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ఎన్నో గ్రామలు ముంపునకు గురయ్యాయి అన్నారు. ప్రజల దృష్టిని మరలించేందుకు కుట్ర కోణం దాగి ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన పిటిషన్ ద్వారా విచారణ చేపట్టాలన్నారు. పర్యాటక ప్రాంతంగా చూపెట్టారని కానీ అసలు వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని అన్నారు.