Friday, December 20, 2024

తెచ్చిన అప్పులతో నష్టం జరగలేదు

- Advertisement -
- Advertisement -

ఆస్తులు పెంచాం: జగదీశ్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ :  దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యుత్ శాఖ మా జీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమెట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.44,438 కోట్లు ఉంటే.. అప్పు రూ. 22,423 కోట్లు ఉండేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ.81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ రూ.1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదన్నారు. ఆస్తులు పెంచామని వివరించారు.

ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ దేవులాడుకురావడం, క్యాండిల్స్ కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీ ళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. అలా బోరుబావి దగ్గరికి పోయాక కరెంటు పోతే.. రెండు గంట లా, మూడు గంటలా, నాలుగు గంటలా, ఎన్ని గంటలు అక్కడే ఉండా లో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. బిందెడు నీళ్లు లేకుండా ఇంటికి పో తే ఎసరు పెట్టే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఆనాడు పరిశ్రమలు, వా ణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లే ని ఇల్లు ఉండేదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధ ర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ రాక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారన్నారు. ఎండిక కంకులు చేతపట్టి సభలో ప్రదర్శించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ నాటి ముఖ్యమంత్రి కేసిర్ విద్యుత్‌రంగంపైన ఫోకస్‌పెట్టారన్నారు. అధికారలతో ప్రత్యేక సమావేశాలు సమీక్షలు నిర్వహించి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. ఆనాటి 7800మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్దాన్ని పెంచారన్నారు.

విద్యుత్ ఉత్పత్తి సామర్దాన్ని పెం చటం, విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థలను పటిష్ట పరచటం , విద్యుత్ పంపీణ వ్యవస్థలను ఆధునీకరించి విస్తరించటం వంటి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఉత్పత్తి, సరఫరా , పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయటంతోపాటు తొలుత గృహ, వాణిజ్య రంగాలకు 24గంటల విద్యుత్ సరఫరాను చేపట్టారని గుర్తు చేశారు. పరిశ్రమలకు క్రాప్‌హాలిడేల స్థాయి నుంచి సమృద్దిగా విద్యుత్ అందించే స్థాయికి విద్యుత్‌రంగాన్ని తీర్చిదిద్దారన్నారు. వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. విద్యుత్‌ఉత్పత్తి సామర్దాన్ని 18567మెగావాట్లకు చేర్చినట్టు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థను కూడా బలోపేతం చేసినట్టు తెలిపారు. 400కెవి. ట్రాన్స్‌ఫార్లరు ఆరు నుంచి 25కు పెంచినట్టు తెలిపారు. 220కేవి 51నుంచి 103కు, 132కేవి 176 నుంచి 250కి, 33కేవి 2110 నుంచి అదనంగా 1060కి పెంచామని వివరించారు. 16379 కిలోమీటర్ల మేరకు ఉన్న లైన్లను 27986 కి.మి కి పెంచామన్నారు. 39345 మిలియన్‌యూనిట్ల విద్యుత్ సరఫరా స్థాయికి పెంచామన్నారు. వ్యవసాయవిద్యుత్ కనెక్షన్ల సంఖ్యను 24 లక్షల నుంచి 28లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1356 నుంచి 2349 యూనిట్లకు పెరింగిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సర్వీసు ల సంఖ్య 1.11కోట్ల నుంచి 1.87కోట్లకు చేరిందని తెలిపారు. విద్యుత్‌రంగంపైన కమిషన్ లేదా సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించుకోవచ్చని సవాల్ చేశారు. వెంటనే విచారణ జరపాలన్నారు.దోషులకు శిక్ష పడాలని, అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారికి కూడా శిక్షలు పడాలని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News