కంటోన్మెంట్ : కం టోన్మెంట్ ప్రాంతంతో పాటు ఓల్డ్‌బోయిన్‌పల్లి జిహెచ్‌ఎంసీ ప్రాంతంలో దాదాపు వరదనీటి సమస్యకు శా శ్వత పరిష్కరం లభించనుందని బిఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్, క ంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవా రం కంటోన్మెంట్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలో ప్రధానమైన రామన్నకుంట వరదనీటి సమస్యపై ఆ యనను కలిసి ఆయన దృష్టికి తెచ్చిన విషయాలపై బుధవారం ఉదయం బోయిన్‌పల్లిలోని మర్రిరాజశేఖర్‌రెడ్డి కార్యాలయంలో మాజీ బోర్డు ఉ పాధ్యక్షుడు జెమ్మార్ మాజీబోర్డు స భ్యులు పాండుయాదవ్ ఇతర మా జీ బోర్డు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెం ట్ ప్రాంత వాసులు వరదముప్పున కు గురి అవుతున్న సుమారు 25 కాలనీలు ,బస్తీలకు శాశ్వత పరిష్క రం లభించనుందని అన్నారు. జిహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న బా క్స్‌టైపు డ్రైనేజీ వ్యవస్థను కంటోన్మెంట్ ఆరవవార్డులోని హర్షవర్థన్‌కాలనీ, మర్రిరాంరెడ్డి, సీతారాంపూర్, సౌజన్యకాలనీ తదితర ప్రాంతాల్లో బాక్స్‌టైప్ నిర్మాణ పనులకు మంత్రి కె టిఆర్ పెద్దమనస్సుతో 30 కోట్ల నిధులను కేటాయించారని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని పూర్తి అయిన వెంటనే పనులను ప్రా రంభించనున్నామని దీంతో కంటోన్మెంట్ వరదముప్పు ప్రాంతవాసులకు శాశ్వత పరిష్కరం లభించనుందని అన్నారు.
అనంతరం మాజీబో ర్డు సభ్యుడు పాండుయాదవ్ మాట్లాడుతూ… గతంలో కెటిఆర్ చెరువుల ప్రక్షాళనకు 3 కోట్ల రూపాయల ని ధులను కేటాయించటంతో రామన్నకుంట చెరువులో మురుగునీరు చెరుకుండా మురుగునీటి వ్యవస్థకు వేరువేరుగా మురుగునీటి వ్యవస్థను ఏ ర్పాటు చేయటం జరిగిందని అడిగిన సమస్యలను అర్థం చేసుకొని నిధులను కేటాయిస్తున్న ముఖ్యమం త్రి కెసిఆర్, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలను తె లియజేస్తున్నట్లు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు నళినికిరణ్, పెద్దాల నర్సింహ్మయాదవ్, ది వంగత నేత మాజీ బోర్డు సభ్యుడు ప్రభాకర్ తనయుడు సాయికిరణ్, ముప్పిడిమధుకర్, ప్రవీణ్ యాదవ్, రాజుసింగ్, అజయ్ యాదవ్, సురే ష్, శ్రీకాంత్ పనస, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.