అమరావతి: గోదావరి నదీ పారుతున్న తాగేందుకు అనేక ఇబ్బందులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పర్యావరణ కాలుష్యం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామని, పర్వావరణ శాఖను బలోపేతం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అధికారంలో రాగానే పింఛన్లు పెంచి ఇచ్చామే కానీ తగ్గించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టారని, అవే నిధులు కాకినాడలో ఉపయోగిస్తే జిల్లాలో అభివృద్ధి జరిగేదని పవన్ తెలియజేశారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఎపిలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని, పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో అర్థంకావడంలేదని పవన్ చెప్పారు.
నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు: పవన్ కల్యాణ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -