గ్రూప్ 1 పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని ప్రకటన
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 పై టిఎస్‌పిఎస్‌సి కీలక ప్రకటన చేసింది. గ్రూప్ వన్ పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. జోన్‌లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఖాళీలను బట్టి ఒక్కో క్యాటగిరిలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 503 పోస్టులకు గాను మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్1 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపించారు.