- Advertisement -
మూడో దశను
ఎదుర్కొనేందుకు సిద్ధం
సోషల్ మీడియాలో వచ్చేవి
తప్పుడు ప్రచారాలే : డిహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్‌లు ఉండబోవని ఇదివరకే చెప్పామని, మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తు న్నామని అన్నారు. జనవరి చివరలో లాక్ డౌన్ ఉండొచ్చునని తాను చెప్పినట్టుగా సో షల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లే దని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచా రం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని డిహెచ్ హెచ్చరించారు.
- Advertisement -