Saturday, December 21, 2024

2024 ఎన్నికల్లో థర్డ్‌ఫ్రంట్ ఉండదు

- Advertisement -
- Advertisement -

పాట్నా: 2024 పార్లమెంటు ఎన్నికల్లో థర్డ్‌ఫ్రంట్ అంటూ ఏదీ ఉండదని, వచ్చే సారి ఏర్పాటయ్యేకూటమి ప్రధాన ఫ్రంట్‌గానే ఉంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కమార్ స్పష్టం చేశారు. ఆదివారం పాట్నాలో జరిగిన తన పార్టీ జెడి(యు ) సమావేశంలో కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆయన ఈ విషయం ప్రకటించారు. బిజెపిని వ్యతిరేకించే పార్టీలు గనుక చేతులు కలపడడానికి అంగీకరిస్తే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీలు బారీ మెజారిటీతో గెలవగలవని నితీశ్ అన్నారు. దీన్ని వాస్తవం చేయడానికి తాను ప్రయత్నిస్తూనే ఉంటానని, కలిసి రావాలో వద్దో నిర్ణయించుకోవలసింది ఆ పార్టీల ఇష్టమని ఆయన అన్నారు. నితీశ్ కుమార్ ఇటీవలి కాలంలో పలువురు విపక్ష నేతలను కలిసి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి భావస్వామ్య పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడేలా చూడడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని నితీశ్ స్పష్టం చేసినప్నటికీ కొందరు మాత్రం జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర పోషించడం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సందర్భంగా నితీశ్ తన ఒకప్పటి భాగస్వామి అయిన బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 2020 లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బిజెపి జెడి(యు)కు వ్యతిరేకంగా పని చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించక పోవడానికి కూడా ఆ పార్టీయే కారణమని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాపైనా విమర్శలు చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను బైటపెట్టడానికి మీడియాను అనుమతించరని, అయితే అధికారం కోల్పోగానే మీడియా అన్ని విషయాలను ప్రచురిస్తుందని నితీశ్ అన్నారు. సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన నితీశ్ తాను మరోసారి ముఖ్యమంత్రి కావడానికి ఇష్టపడని విషయాన్ని గుర్తు చేస్తూ, అయితే బిజెపి పట్టుబట్టడం వల్లనే సిఎం పదవి చేపట్టినట్లు తెలిపారు. ‘అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంనుంచి బీహార్‌కు ఏమీ లభించడం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను అంగీకరించలేదు. ప్రధాని మోడీ బ్రిటీష్ కాలంనాటినుంచి భోగభాగ్యాలతో తులతూగుతున్న రాష్ట్రానికి చెందిన వారు. పేద రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందితే తప్ప దేశం పురోగతి సాధింలేదు’ అని నితీశ్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News