- Advertisement -
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లకే జరగనున్నాయి. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యాసంవత్సరం పదో తరగతికి 30 శాతం సిలబస్‌ను తగ్గించి, ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నారు. కొవిడ్ పరిస్థితుల కంటే ముందు 11 పేపర్లకు పదో తరగతి పరీక్షలు జరిగేవి. కొవిడ్ సమయంలో పాఠశాలలు సరిగ్గా నడవకపోవడం, ఆన్‌లైన్ తరగతులే ఎక్కువగా జరగడం తదితర కారణాల వల్ల సిలబస్‌ను, పేపర్లను కుదించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఈసారి కూడా ఆరు పేపర్లకే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాణ నిర్ణయించింది.
- Advertisement -