Tuesday, April 1, 2025

3 నెలలకు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే..

- Advertisement -
- Advertisement -

ఎక్కువ రోజుల చెల్లుబాటుతో వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?.. తక్కువ ధరకు ఎక్కువ చెల్లుబాటు, మరిన్ని ప్రయోజనాల కోసం చూస్తున్నారా..? అయితే, మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అవి రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తమ వినియోగదారులకు దాదాపు 3 నెలలు అంటే 84 రోజుల పాటు అనేక ప్రణాళికలను అందిస్తున్నాయి. మరి ఎవరి ప్లాన్ ఉత్తమమైనది. ఎవరిది పొదుపుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

జియో 84 రోజుల రీఛార్జ్ ప్లాన్
జియో 84 రోజుల రీఛార్జ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే.. కంపెనీ కేవలం రూ.799 ప్లాన్‌ను అందిస్తుంది. ఇది దాదాపు 3 నెలల చెల్లుబాటుతో అన్ని నెట్‌వర్క్ కాలింగ్‌కు మద్దతు ఇచ్చే అపరిమిత కాలింగ్ సౌకర్యంతో వస్తుంది. ఈ ప్లాన్ లో డేటా, SMS, OTT సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ తో రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMSలు, Jio యాప్ లకు ఉచిత యాక్సెస్ కూడా పొందొచ్చు. జియో టీవీ, జియో హాట్‌స్టార్, జియో క్లౌడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ ప్లాన్ గురుంచి మాట్లాడితే.. కంపెనీ కేవలం రూ. 859 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో డేటా, కాలింగ్, SMS సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ రూ.859 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తాయి.

Vi 84 రోజుల రీఛార్జ్ ప్లాన్
ఐడియా 84 రోజుల రీఛార్జి ప్లాన్ గురుంచి మాట్లాడితే..కంపెనీ రూ.979 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాతో వస్తుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 SMS సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్, జియోతో పోలిస్తే, వోడాఫోన్ ఐడియా ఈ 3 నెలల ప్లాన్ కొంచెం ఖరీదైనది. కానీ ఇది రోజుకు 2GB డేటా సౌకర్యాన్ని అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News