Monday, March 10, 2025

బట్టతల రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

- Advertisement -
- Advertisement -

పురుషుల్లో బట్టతల అనేది ఎప్పుడూ కనిపించే సమస్య. వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం లేదా క్రమంగా బట్టతల రావడం పురుషుల్లో పెద్ద సమస్యగా మారిపోయింది. కానీ ఈ రోజుల్లో చిన్న వయసు ఉన్నవారికి కూడా బట్టతల వస్తోంది. పురుషులలో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రధాన కారణం.. జన్యుపరమైన కారణాల, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. దీనితో పాటు, పురుషులలో బట్టతలకి కారణమయ్యే అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

జన్యుపరమైన కారణాలు

బట్టతలకి అత్యంత సాధారణ కారణం వారసత్వం. దీనిని “ఆండ్రోజెనెటిక్ అలోపేసియా” అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా వంశంలో మగవారి కి వస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ హెయిర్ ఫోలికల్స్‌పై ప్రభావం చూపినప్పుడు, జుట్టు రాలడానికి కారణమైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

హార్మోన్ల మార్పులు

హార్మోన్ల అసమతుల్యత శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. వాటిలో ఒకటి బట్టతల. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం లేదా తగ్గడం లేదా ఇతర హార్మోన్ల మార్పుల కారణంగా జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ రకమైన బట్టతల అనేది సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వస్తుంది.

మానసిక ఒత్తిడి

ఈరోజుల్లో మనం జీవిస్తున్న జీవనశైలి కూడా జుట్టు పెరుగుదలను ఒక కారణం కావొచ్చు. అధిక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు పెరుగుదల ప్రక్రియ దెబ్బతింటుంది. ఇది అసాధారణ జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని “టెలోజెన్ ఎఫ్లూవియం” అని కూడా పిలుస్తారు.

పోషకాహార లోపం

ఐరన్, జింక్, విటమిన్ డి, బి12 వంటి విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. అందుకే ఇవి లభించే ఆహారాలను తీసుకోవాలి. ఈ పోషకాల లోపం జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా జుట్టు త్వరగా రాలడం ప్రారంభమవుతుంది.

వైద్య పరిస్థితులు, మందులు

థైరాయిడ్ రుగ్మత, అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇది కాకుండా.. కొన్ని ఔషధాల వినియోగం (కీమోథెరపీ, యాంటిడిప్రెసెంట్స్ వంటివి) కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News