Monday, December 23, 2024

భవిష్యత్ తరాలకు ఈ గ్రంథాలు ఉపయోగపడతాయి

- Advertisement -
- Advertisement -
These texts will be useful for future generations
తెలంగాణ చట్టాల 15 సంకలనాల పుస్తకాలను
ఆవిష్కరించిన సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో ఉన్న పలు చట్టాలు, రెగ్యులేషన్లతో కూడిన తెలంగాణ చట్టాల 15 సంకలనాలు పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఈ సమగ్ర సమాచారం కలిగిన గ్రంథాలు ఉపయోగపడతాయన్నారు. దాదాపు తొమ్మిది వేలపేజీలతో కూడిన ఈ సంపుటాలను ముద్రించడం చాలా కఠినమైన పని అని, దీనిని విజయవంతంగా నిర్వహించడం పట్ల న్యాయ విభాగ అధికారులను ఆయన అభినందించారు. తెలంగాణ న్యాయ బాండాగారం మొత్తం ఒకే దగ్గర లభించడం గొప్ప విషయం అన్నారు. వీటివల్ల ఉద్యోగుల పనితీరులో కూడా గణనీయమైన అభివృద్ధి వస్తుందని సోమేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ముద్రించిన ఈ తెలంగాణ స్టేట్ యాక్ట్‌లకు చెందిన 15 వాల్యూములను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ప్రభుత్వ కార్యదర్శులు, హై-కోర్టుకు పంపడం జరుగుతుందని ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వెబ్ సైట్ https:law.telangana.gov.in/statelaws అనే వెబ్‌సైట్‌లో ఈ తెలంగాణ స్టేట్ యాక్ట్‌లను అప్‌లోడ్ చేశామని సంతోష్ రెడ్డి వెల్లడించారు.

1308 ఫసలీ నుంచి 1925 వరకు…

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గతంలోని చట్టాలను సవరించడం, మార్పుల అనంతరం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలతో కూడిన 15 సంపుటాలను రాష్ట్ర సాధారణ పరిపాలన న్యాయ శాఖ మొదటిసారిగా వెలువరించింది. ఈ 15 సంపుటాల్లో 1308 ఫసలీ నుంచి 1925 వరకు ఉన్న చట్టాలు, రెగ్యులేషన్లు, 1956 జీహెచ్‌ఎంసి యాక్ట్ నుంచి 2018 నుంచి 2021 వరకు అమల్లో ఉన్న చట్టాలు సమగ్రంగా ఉన్నాయి. 2016 జూన్ 1 వ తేదీ నాటికి స్వీకరించిన 299 చట్టాలు, తొలగించిన 44 చట్టాలు, 2014 జూన్ నుంచి 2021 డిసెంబర్ వరకు తిరస్కరించిన 27 చట్టాలు, 2021 డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉన్న మొత్తం 287 చట్టాలు, 17 రెగ్యులేషన్లు ఈ 15 వాల్యూల్లో ముద్రించామని, భావితరాలకు ఇది ఎంతో ఉపయోగకరమని – సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ పరిపాలన న్యాయ శాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News