Friday, December 20, 2024

రైతులకు నిరంతరం అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

కుంటాల : రైతులకు నిరంతరం అండగా ఉంటానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుంటాల సొసైటీ కేంద్రంలోని సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికి 8 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని కొంత మేర రైతులకు కుంటాల మండలంతో పాటు ముథోల్ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొవడంతో రైతులు అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషితో 8 నుంచి 15 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని స్థానిక కుంటాల మండల ప్రజా ప్రతినిధులు విన్నవించగా వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌లో రైతుల సమస్యలపై విన్నవించగా స్పందించిన మంత్రి 8 నుంచి 15 క్వింటాళ్లు ఎకరానికి ఒక రైతు వద్ద జొన్నలు కొనుగోలు చేయాలని వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు సైతం ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జొన్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జొన్న రైతుల సమస్యను పరిష్కరించారు. దీంతో ఆయన సిఎం కెసిఆర్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యాభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి…
విద్యాభివృద్ధ్ది ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం జరిగే విద్యాదినోత్సవం సందర్భంగా ముందుగా ఆయనకు విద్యాదినోత్సవ పరికరాలను మండల విద్యాధికారి వటోలి ముత్యంతో సహా ఉపాధ్యాయ సిబ్బంది అందజేశారు. ఈ సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి ద్వారా అనేక రకాల వసతులతో కూడిన పరికరాలను అందిస్తూ విద్యను అందిస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అంతేగాకుండా ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరు శాతం పెంచేలా కృషి చేయాలన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తుందని, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు ప్రణాళిక బద్ధ్దమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గంగామణి బుచ్చన్న, మండల విద్యాధికారి ముత్యం, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, సర్పంచ్‌లు సమత, దాసరి కిషన్, పెదకాపు మల్లేష్, లక్ష్మీ రమేష్, ఎంపిటి మధు, బిఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట ధశరథ్, బిఆర్‌ఎస్ నాయకులు జుట్టు మహేందర్, జడ్పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాద్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News