Monday, December 23, 2024

బిజెపి తొలి జాబితాలో వీరే !

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ప్రసుత్త ఎంపిలు, ఎమ్మెల్యేలతో మాజీలకు ప్రాధాన్యం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆరు నెలల క్రితమే పలు నియోజకవర్గాల్లో క్రియాశీలక ఆశావహులను గుర్తించి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటి వడపోత కార్యక్రమం ఇప్పటికే పూర్తికావడంతో.. వారం రోజుల్లో తొలి జాబితాను విడుదల చేసేందుకు బిజెపి ఏర్పాట్లు చేస్తోంది.

తొలి జాబితాలో 35 నుంచి 40 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బిజెపి ముఖ్యనేతలు వెల్లడిస్తున్నారు. తొలి జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధానంగా ప్రసుత్తం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న వారితో పాటు మాజీ ఎంపి, ఎమ్మెల్యేలు తొలి జాబితాల్లో ఉన్నట్లు సమాచారం.

అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ముషీరాబాద్ నుంచి- బండారు విజయలక్ష్మి, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్ రెడ్డి, ఉప్పల్‌లో – ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మల్కాజిగిరి నుంచి రాంచందర్‌రావు, ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్ లో- విక్రమ్ గౌడ్, మహేశ్వరం నుంచి- అందెల శ్రీరాములుయాదవ్, కల్వకుర్తి- తల్లోజు ఆచారి, గద్వాల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మహబూబ్‌నగర్‌లో జితేందర్ రెడ్డి, తాండూరు నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో – బూర నర్సయ్య గౌడ్, కుత్బుల్లాపూర్‌లో కూన శ్రీశైలంగౌడ్, భువనగిరిలో- గూడూరు నారాయణరెడ్డి, ఆలేరులో – కాసం వెంకటేశ్వర్లు, హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే- ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు- బండి సంజయ్, చొప్పదండిలో – బొడిగే శోభ, వరంగల్ తూర్పులో – ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, భూపాలపల్లిలో – చందుపట్ల కీర్తి రెడ్డి, వేములవాడలో – చెన్నమనేని వికాస్‌రావు, ఆదిలాబాద్‌లో – పాయల్ శంకర్ బోథ్‌లో పార్లమెంట్ సభ్యుడు – సోయం బాపూరావు, ఆర్మూర్ నుంచి ఎంపి- ధర్మపురి ఆర్వింద్, మునుగోడులో- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేటలో- సంకినేని వెంకటేశ్వర్లు , పరకాల నుంచి- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుబ్బాకలో ఎమ్మెల్యే – రఘునందన్‌రావు, వర్ధన్నపేటలో – కొండేటి శ్రీధర్, మహబూబాబాద్‌లో హుస్సేన్ నాయక్, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్- బండ కార్తీక రెడ్డి, నర్సంపేటలో – రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిర్మల్-లో మహేశ్వర్ రెడ్డి, వరంగల్ పశ్చిమలో ఏనుగుల రాకేశ్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో- విజయరామారావు, రాజేంద్రనగర్ నుంచి – తోకల శ్రీనివాస్ రెడ్డిలు అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News