Thursday, January 23, 2025

దేశాన్ని అమ్మేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. దే శాన్ని అయినకాడికి తన అనుయాయులకు ఈ నేతలు అడ్డదిడ్డంగా అమ్మేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని తన గుజరాతీ దోస్తులకు అమ్మి.. తిరిగి నష్టాల్లో ఉన్నాయని.. కొన్నోడు దరఖాస్తు పెట్టుకుంటే రుణాలు మాఫీ చేస్తున్నారన్నారు. 8 ఏండ్లలో ఇలా రూ.12లక్షల కోట్లు బడాబాబుల కు రుణాలు మాఫీ చేశారన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. జిల్లా కేంద్రం నారాయణపేటలో ఎ మ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రూ.196 కో ట్లతో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులకు కెటిఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా మంత్రు లు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నా రు.

అనంతరం మినీ స్టేడియంలో జరిగిన ప్రజా నివేదన సభలో కెటిఆర్ మాట్లాడుతూ.. పాలమూరులో ఎటువంటి అభివృద్ధి చేయని మోడీ ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడగడానికి వస్తారని నిలదీశారు. అధికార కాంక్ష కోసమే మోడీ అబద్ధాలు చె ప్పి ప్రధాని అయ్యాడని, మోడీ పెద్ద అబద్ధాల కోరని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పారుతున్న కృష్ణా నీటిపై తెలంగాణ, ఆంధ్ర మధ్య బిజెపి పంచాయితీ పెడుతున్నదని, దమ్ముంటే పాలమూరులో జరిగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కృష్ణా నీటి వాటా తేల్చాలని కేంద్రంపై తీర్మానం చేయాలన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులకు వెన్నెముక ఉంటే.. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని తీర్మానం చేయాలన్నారు.

అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు ఇంటి పెద్ద చేయాలని, అయితే రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 811 టిఎంసిలలో ఇరు రాష్ట్రాల కృష్ణా జలాల వాటా తేల్చటంలేదని, కనీసం మోడీ ప్రభుత్వానికి ట్రైబ్యునల్‌కు ఓ లేఖ రాసే టైం కూడా దొరకటం లేదన్నారు. మోడీ ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇరు రాష్ట్రాల పంచాయితీ సెటిల్‌చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు ప్రజలకు నీరివ్వకపోతే పంటలు ఎండి ప్రజలు కడుపుమండి ఈ ప్రభుత్వంపై తిరగబడి తమకు ఏదైనా అవకాశం ఇస్తారేమోనన్న దురాలోచన, దుష్టఆలోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారన్నారు.

పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలి

ఎన్ని అడ్డంకులు వచ్చినా పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు కోసమే ఉద్యమం జరిగిందని అయితే నియామకాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చి 2.10 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేన్నారు. అదేవిధంగా ఒక్క రోజులో పేటకు రూ.196 కోట్ల నిధులు వచ్చాయంటే మనను పాలించే కెసిఆర్ అక్కడ స్వయంపాలన అందిస్తున్నందునే.. మన నిధులు మనకు వస్తున్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. నీళ్ల విషయంపై తెలంగాణ రాకముందు వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో ఆలోచించాలన్నారు. తెలంగాణలో కృష్ణా జలాల్లో మనకు వీలైనంత నీరు వాడుకుంటున్నామన్నారు. ఓవైపు కాంగ్రెస్, బిజెపి కోర్టులో కేసులు వేస్తూ, మన నీటి వాటా తేల్చకున్నా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 11లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

వెనకబడ్డ, కరువు సీమ మహబూబ్‌నగర్, ఫ్లోరిసిస్ పీడిత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహానగరం కృష్ణా బేసిన్‌లో ఉందని, రైతన్నల బాగు కోసం నీటి వాటా తెల్చమంటే ఉలుకు పలుకూ లేకుండా దున్నపోతుమీద వానపడ్డట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. పాలమూరులో ఉన్న బిజెపి నాయకులకు ఉమ్మడి పాలమూరును జిల్లా రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా 500 టిఎంసిల నీటిని ఇవ్వాలని తీర్మానం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. 2022 వరకు దేశంలోని రైతుల ఆదాయం డబుల్ చేస్తాడని మోడీ దగుల్బాజీ మాటలు మాట్లాడాడని, అయితే కెసిఆర్ పుణ్యమా అని తెలంగాణ రైతుల ఆదాయం డబుల్ అయ్యింది కానీ, మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రధాని ఆర్థిక సలహాదారు వివేక్ దెబరాయ్ ఓ పత్రికలో వ్యాసం రాస్తూ.. రైతుల ఆదాయం డబుల్ అయిందని రాశారని, దీన్ని బట్టి చూస్తే ఇక రైతులపై కూడా ఆదాయం పన్ను వేయాలని దుర్మార్గ ఆలోచన చేస్తున్నట్టు ఉందన్నారు. ఆ రాసినోడు అల్లాటప్ప వ్యక్తికాదని, ప్రధాని ఆర్థిక సలహాదారన్నారు.

ఆదాయమే లేదని రైతులు అంటుంటే.. ఆదాయపన్ను వేస్తారంట రైతులు ఈ విషయం ఆలోచించాలన్నారు. మోడీ కంటే ముందు దేశాన్ని పాలించిన 14 మంది పిఎంలు కలిసి మొత్తం రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఒక్క మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. దేశంలో పుట్టే ప్రతిబిడ్డపై రూ.లక్ష 25వేల అప్పు వేస్తున్నదన్నారు. ఎందుకోసం అప్పు చేసిండని అడిగితే చెప్పే మొఖం లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనంగా సెస్ వేసి రూ.30 లక్షలు కోట్ల అదనంగా గుంజారన్నారు. మసీదులు తవ్వి శవం వస్తే మీది, శివం వస్తే మాది అని మాట్లాడే వారు బిజెపి అధ్యక్షుడా అని ప్రశ్నించారు. ఆయన ఇంతకు మనిషా, ఇందుకేనా రాజకీయాల్లో ఉండేదన్నారు.

పేటకు ఓ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కెసిఆర్ ప్రభుత్వం ఇస్తుంటే మోడీ ప్రభుత్వం 8 ఏళ్లలో ఒక్క విద్యాసంస్థ కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. వీరందరిని మట్టి కరిపించి 2024లో కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు. మోడీ కంటే అసమర్థ, పనికిమాలిన ప్రధాని ఇప్పటివరకు భారతదేశంలో రాలేదన్నారు. దానికి కారణం మోడీ ప్రభుత్వమేనన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణామోహన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం, జడ్పి చైర్‌పర్సన్లు వనజమ్మ, సరిత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News