గోషామహల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ,దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా అమరజ్యోతి ప్రారంభోత్సవ కార్యకమంలో పాల్గొ న్న తనను గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు నాయకులు తనను అక్రమంగా అరెస్ట్ చేయించి అవమానించారని గోషామహ ల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శీలం సరస్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీలో తన ఎదుగులను చూసి ఓర్వలేక కొందరు పార్టీ నాయకులు పోలీసులు, మీడియాతో కుమ్మక్కై ముగి ంపు ఉత్సవాల్లో పాల్గొన్న పోలీసులు తనను అక్రమంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, అవమానించారని ఆమె వాపోయారు. ఈ విషయమై సమగ్ర వి చారణ జరిపించాలని త్వరలో సిఎం కెసిఆర్, మ్ంరతి కెటిఆర్‌లను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించి తన ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులతో పాటు తెరవెనుక గల బీఆర్‌ఎస్ నేతలపై చట్టరీత్యా చర్యలు చేనట్టాలని కోరారు.
నా ఎదుగుదల చూసి ఓర్వలేక అక్రమంగా అరెస్ట్ చేయించారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -