Monday, December 23, 2024

బిసిలకు ఎక్కువ సీట్ల్లు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 119 అసెంబ్లీ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఆదివారం బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కల్పించి అన్ని పార్టీలకు బిఆర్‌ఎస్ పార్టీ ఆదర్శంగా నిలవాలని సిఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని, మెజార్టీ కులాలకు జనాభా దా మాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని రాష్ట్ర సాధన కోసం సబ్బండ కులాలు ఉద్యమించారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలు ప్రొఫెసర్ జయశంకర్ నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్ కిష్టయ్య, కాసోజు శ్రీకాంత్ చారి వరకు వందలాది మంది బలిదానం చేశారని, సకలజనుల ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులు అయ్యారని గుర్తు చేశారు.

వారం రోజులుగా అనధికారికంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే అంటూ మీడియాలో చెక్కర్లు కొడుతుందని, ఇదే సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ నుండి మళ్ళీ 90శాతం సెట్టింగ్ లకే అవకాశం కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయని,ఒకవేళ ఇదే నిజమైతే గత రెండు ఎన్నికల్లో జరిగిన అన్యాయమే బీసీలకు ఇప్పుడు జరుగుతుందన్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు అనడం చాలా విడ్డూరమన్నారు. బీసీలకు పార్టీ పగ్గాలు ఇవ్వకుండా, పాలనలో ప్రాతినిద్యంలో ఇవ్వకుండా సర్వేలలో బీసీల పేరు వస్తేనే టికెట్ ఇస్తమంటే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా అగ్రకుల ఆధిపత్య వాళ్లకు టికెట్ ఇవ్వకుండా పరోక్షంగా బీసీలను పొమ్మనకుండా పొగబెట్టడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

పోటీ చేసే అభ్యర్థులను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తరు అనుకుంటే,మరి రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, పరిపాలిస్తున్నటువంటి నాయకులపై ప్రజల్లో విశ్వాసం లేదనే వాస్తవాన్ని ఒప్పుకొన్నట్లేనని ఆయన అన్నారు. అగ్రకులాలకు వారి జనాభా దామాషా ప్రాతిపదికన వారి కేటాయించి, బీసీలకు కూడా 60 స్థానాలు కేటాయిస్తే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారని, లేదంటే బీసీలకు నామమాత్రంగా టికెట్లు ఇస్తే భవిష్యత్తులో బిఆర్‌ఎస్ పార్టీ బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాకుండా, భవిష్యత్ లో రాజకీయంగా భారీ మూల్యాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News