Wednesday, January 8, 2025

జల్సాలకు బానిసై చోరీలు..

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ : క్రికేట్ బెట్టింగ్‌లతో పాటు జల్సాలకు అలవాటు పడి పట్టపగలు తాళం వేసిన ఇండ్లను లక్షంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న పాత నేరస్తున్ని గురువారం అదుపులోకి తీసుకొని అతని నుంచి 16.5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3లక్షల 48వేల 900ల నగదును స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మల్కాజిగిరి ఎస్‌ఓటి డిసిపి గిరిధర్, ఏసిపి నరేష్ రెడ్డి, సిఐ అశోక్ రెడ్డిలు మాట్లాడుతూ ఘట్‌కేసర్ మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో అనుమాన స్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి ఎస్‌ఓటి పోలీసులు, ఘట్‌కేసర్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకొని విచారించి అతను జిల్లా, కళ్యాణ దుర్గం పట్టణం, కొమ్మన చెట్ల వీదికి చెందిన పీట్ల గంగాధర్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.

గంగాధర్ 2013 నుంచి తాళం వేసిన ఇండ్లను లక్షంగా చేసుకొని పట్ట పగలు దోపిడీలు చేసే వాడని, ఈ క్రమంలో ఘట్‌కేసర్ పట్టణం ద్వారాక నగర్ కాలనీ చెందిన తాల్క రాములు గత నెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి చర్చికి వెళ్ళి రాగా తాళం పగులగోట్టి బీరువాలో నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5లక్షల నగదు దోచుక పోయినట్లు విచారణలో అంగీకరించాడన్నారు. సదర్ నిందితుని నుంచి 16.5 తులాల బంగారు అభరణాలు, 3లక్షల 48 వేల 900 రూపాయల నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నింధితుడు గంగాధర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో 40కి పైగా కేసులు ఉన్నాయని, దోపిడీ చేసిన డబ్బులతో క్రికేట్ బెట్టింగ్, పేకాట ఆడేవాడని చెప్పారు. పాత నేరస్తున్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఓటి పోలీసులను, ఘట్‌కేసర్ పోలీసులను ఎస్‌ఓటి డిసిపి గిరిధర్, ఏసిపి నరేష్ రెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్ రెడ్డి, అడిషనల్ సిఐ జంగయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News