చిట్టీలు వేసి పనికానిస్తున్న నిందితుడు
43 చోరీలు చేసిన అంబేద్కర్
230 తులాల బంగారు ఆభరణాలు, 10కిలోల వెండి స్వాధీనం
రూ.1.30 కోట్ల సొత్తు స్వాధీనం
హైదరాబాద్: కలగని చోరీలు చోరీలు చేస్తున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 230 తులాల బంగారు ఆభరణాలు, 10కిలోల వెండి వస్తువులు, రూ.18,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని గుంటూరుజిల్లా, పిడుగులరాళ్ల, గాంధీనగర్‌కు చెందిన ముచ్చు అంబేదర్కర్ అలియాస్‌రాజు అలియాస్ రాజేష్ అలియాస్ ప్రసాద్ అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్ నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. అంబేద్కర్ వెళ్లాలా వద్దా అనేది ముందు రోజు వచ్చే కలపై ఆధాపడతాడు, కలవచ్చిందంటే ఆ ఇంట్లో చోరీ చేస్తాడు. ఏ రోజు చోరీకి వెళ్లాలో ముందుగా రాసుకున్న చిట్టీల ఆధారంగా ని ర్ణయం తీసుకుంటాడు, చిట్టీలో ఈ రోజు చోరీ చేయాలని ఉంటే చోరీ చేస్తాడు. నిందితుడు 30 ఏళ్ల నుంచి చోరీలు చేసి 230 తులాల బంగారు ఆభరణాలు కూడబెట్టాడు.
మొదటి చోరీని 30 ఏళ్ల క్రితం కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో చేశాడు. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 43 చోరీలు చేశా డు. పదేళ్ల నుంచి ఇప్పటి వరకు నిందితుడు పోలీసులకు చిక్కలేదు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 27 చోరీలు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. ఫుట్‌పాత్‌పై పడుకునే నిందితుడు అంబేద్కర్ గ్రామంలో మాత్రం మూడంతస్థుల బిల్డింగ్ కట్టాడు. చోరీ చేసిన సొత్తును బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదువబెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, వెంకట్, పిసిలు యూనస్, రమేష్ తదితరులు పట్టుకున్నారు.